కన్న కూతురిని చంపేసి.. నేరం సోదరుల మీద వేసి..!

Published : Jul 03, 2021, 12:36 PM IST
కన్న కూతురిని చంపేసి.. నేరం సోదరుల మీద వేసి..!

సారాంశం

 పొలీసులు అలామ్.. ఇద్దరు సోదరులను అరెస్టు చేసి.. విచారణ మొదలుపెట్టారు. ఈ విచారణలో అసలు నేరస్థుడు అలామ్ అని తెలియడం గమనార్హం.

సోదరుల ఆస్తి మీద కన్నేసి.. దాని కోసం కన్న కూతురినే చంపేశాడు ఓ కిరాతకుడు. ఈ సంఘటన బిహార్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బిహార్ చెందిన అలామ్ అనే వ్యక్తి... ఇటీవల తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో.. బాలిక శవమై కనిపించింది. ఆస్తి కోసం తన ఆరేళ్ల కూతురిని.. తన సోదరులకే అతి కిరాతకంగా చంపేశారంటూ వాళ్లపై నేరం ఆరోపించాడు.

దీంతో.. పొలీసులు అలామ్.. ఇద్దరు సోదరులను అరెస్టు చేసి.. విచారణ మొదలుపెట్టారు. ఈ విచారణలో అసలు నేరస్థుడు అలామ్ అని తెలియడం గమనార్హం. సోదరుల ఆస్తి కాజేసేందుకు అతను అలా కూతురుని చంపేశాడని విచారణలో తేలడంతో అందరూ షాకయ్యారు.

పోలీసుల కథనం ప్రకారం.. తనకు చెందిన భూమిని అమ్ముతానని చెప్పి అదే గ్రామానికి చెందిన వ్యక్తి నుంచి అలామ్ రూ.8 లక్షలు తీసుకున్నాడు. అయితే ఆ భూమి అలామ్‌ది కాదు.. సోదరుడు రుస్తుమ్‌ది. ఆ విషయం భూమి కొన్న వ్యక్తికి తెలియడంతో డబ్బు తిరిగి ఇచ్చేయమని, లేకపోతే కేసు పెడతానని బెదిరించాడు. దీంతో అలామ్ ఓ పథకం రచించాడు. 

తన కూతురిని చంపేసి ఆ కేసులో సోదరులను ఇరికిస్తే, ఆ భూమి తన స్వంతమవుతుందని అనుకున్నాడు. దీంతో తన కూతురిని గొంతు నులిమి చంపేసి చెరుకు తోటలో మృతదేహాన్ని పడేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టాడు. చెరుకు తోటలో మృతదేహం దొరకడంతో సోదరులపై మర్డర్ కేసు పెట్టాడు. అయితే పోలీసుల దర్యాఫ్తులో అసలు విషయం బయటపడడంతో కటకటాల పాలయ్యాడు. 

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport