బాబోయ్.. వాట్సప్ గ్రూపు నుంచి తీసేశాడని.. అడ్మిన్ నాలుక కోసేశారు..

Published : Jan 04, 2023, 06:59 AM IST
బాబోయ్.. వాట్సప్ గ్రూపు నుంచి తీసేశాడని.. అడ్మిన్ నాలుక కోసేశారు..

సారాంశం

వాట్సాప్ గ్రూప్ నుంచి తీసేశాడని ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా అడ్మిన్ ను చితకబాది.. అతడి నాలుక కోసేశాడు.   

మహారాష్ట్ర : చిన్నచిన్న కారణాలకే దాడులకు పాల్పడడం.. దారుణం గా వ్యవహరించడం లాంటి సంఘటనలతో నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అలాంటి ఓ చిన్న సంఘటన కారణంగా ఓ వ్యక్తిని నాలుక కోసేసి, అతి దారుణంగా చితకబాదిన ఘటన మహారాష్ట్రలోని పూనేలో కలకలం రేపింది. డిసెంబరు 28న జరిగిన ఓ ఘటన కాస్త ఆలస్యంగా కొత్త సంవత్సరంలో వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ ఐదుగురు వ్యక్తులు వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించాడని.. ఆ గ్రూపు అడ్మిన్ మీద  విపరీతమైన కోపానికి వచ్చారు.

అతనితో వాగ్వాదం చేసి.. ఆగలేదు..అడ్మిన్ ను పట్టుకుని చితకబాదారు..అతని నాలుకని కోసేశారు. మహారాష్ట్రలోని పూణే లోని పుర్సుంగిలోని ఓ హౌజింగ్ సొసైటీలో డిసెంబర్ 28న ఈ ఘటన జరిగింది. బాధితుడైన గ్రూప్ అడ్మిన్ అక్కడే నివసిస్తున్నాడు. హౌజింగ్ సొసైటీ సమాచారం కోసం ‘ఓం హైట్స్ ఆపరేషన్’ పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేశాడు. ఆ సొసైటీలోని సభ్యులందరూ ఆ వాట్సాప్ గ్రూపులో ఉన్నారు.

భూమిలో పూడ్చిపెట్టుకుని రైతు వినూత్న నిరసన.. ‘ఆ పథకం కింద నాకు రావాల్సిన భూమి ఇవ్వాల్సిందే’ (వీడియో)

అయితే ఇటీవల ఎం జరిగిందో తెలియదు కానీ గ్రూప్ నుంచి ఓ వ్యక్తిని తొలగించాడు. దీనిపై వాట్సప్ గ్రూప్ నుంచి తనను ఎందుకు తొలగించారంటూ.. తీసేసిన వ్యక్తి అడ్మిన్ కు మెసేజ్ చేశాడు. అయితే అడ్మిన్ ఆ మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదు. దీంతో నిందితుడికి తీవ్రమైన కోపం వచ్చింది. అడ్మిన్ కి కాల్ చేసి ఒకసారి కలవాలి అని చెప్పాడు. ఈ మేరకు మరో నలుగురు స్నేహితులలో తీసుకుని అతని దగ్గరికి వెళ్లాడు. అతనితో వాగ్వాదానికి దిగారు.

ఆ తర్వాత ఒక్కసారిగా నఐదుగురు కలిసి అతనిమీద దాడి చేశారు. అడ్మిన్ ను చిదకబాదారు. ఆ తర్వాత అతడి నాలుక కోసేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు తగిన నాలుకను అతికించి కుట్లు వేశారు. ఈ విషయం తెలియడంతో హౌజింగ్ సొసైటీలో భయాందోళనలు నెలకొన్నాయి. అగ్ని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీస్ లు నిందితులపై కేసు నమోదు చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !