Whatsapp Bans: 36 లక్షల భారతీయ అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సాప్.. ఆ ఒక్క కారణంతోనే.. ఇప్పుడు పరిస్థితేంటి?

By Rajesh KarampooriFirst Published Feb 1, 2023, 11:02 PM IST
Highlights

Whatsapp Bans: నూతన ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగా డిసెంబర్ 2022 నెలలో భారతదేశంలో 36 లక్షలకు పైగా 'అభ్యంతరకరమైన' ఖాతాలను నిషేధించినట్లు మెటా యాజమాన్యంలోని వాట్సాప్ బుధవారం తెలిపింది.

Whatsapp Bans: ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం, మెటాకు చెందిన వాట్సాప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. గతేడాది డిసెంబర్ లో ఏకంగా 36 లక్షలకుపైగా భారతీయ అకౌంట్లను బ్యాన్ చేసింది. నూతన ఐటి రూల్స్ 2021కి అనుగుణంగా డిసెంబర్ 2022లో భారత్ లో 36 లక్షలకు పైగా 'అభ్యంతరకరమైన' ఖాతాలను నిషేధించినట్లు మెటా యాజమాన్యంలోని వాట్సాప్ బుధవారం తెలిపింది. 

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై మరిన్ని బాధ్యతలను ఉంచడానికి ఇది సవరించబడుతోంది. గతేడాది డిసెంబర్ 1 మరియు డిసెంబర్ 31 మధ్య 3,677,000 వాట్సాప్ ఖాతాలు నిషేధించబడ్డాయి. వీటిలో 1,389,000 వాట్సాప్ ఖాతాలను వినియోగదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందుకోకముందే.. ముందుజాగ్రత్తగా తామే తొలగించినట్లు పేర్కొంది.అంతకుముందు సెప్టెంబర్ నెలలో 26 లక్షల భారతీయ అకౌంట్లను , అక్టోబర్ లో 23,24,000 వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించిన విషయం తొలగించిన విషయం తెలిసిందే. ఐటీ రూల్స్ 2021 ప్రకారం.. తాము ఈ చర్యలు తీసుకొని.. నివేదిక సమర్పించినట్లు వాట్సాప్ వెల్లడించింది. 

దేశంలో 400 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ డిసెంబర్‌లో దేశంలో 1,607 ఫిర్యాదు నివేదికలను స్వీకరించింది. 166 'చర్యలను' నమోదు చేసింది. వాట్సాప్ ప్రతినిధి మాట్లాడుతూ..'' IT Rules 2021 ప్రకారం.. దానికి అనుగుణంగా 2022 డిసెంబర్ నెలకు సంబంధించి నెలవారీ రిపోర్ట్ అందించాం. ఈ యూజర్ సేఫ్టీ రిపోర్ట్ ప్రకారం.. యూజర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులు మాకు అందాయి. వాటిపై మేం ఏయే చర్యలు తీసుకున్నామనే వివరాలు పొందుపరిచాం. ఇంకా కొన్ని ఫిర్యాదులు అందకముందు వాట్సాప్ ముందస్తుగా చాలా అకౌంట్లను తొలగించింది. డిసెంబర్ నెలలో 3.6 మిలియన్లకు పైగా ఖాతాలను నిషేధించింది.'' అని వాట్సాప్ ప్రతినిధి తెలిపారు.

గతేడాది కేంద్ర ప్రభుత్వం ఐటీకి సంబంధించి కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. దీని ప్రకారం..5 మిలియన్ కంటే ఎక్కువ మంది వినియోగదారులను కలిగి ఉన్న ప్రధాన డిజిటల్ ,  సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు నెలవారీ సమ్మతి నివేదికలను ప్రచురించాలి. ఇదిలా ఉండగా, బహిరంగ, సురక్షితమైన, విశ్వసనీయమైన మరియు జవాబుదారీతనం గల ఇంటర్నెట్‌కు పెద్దపీట వేస్తూ, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ 'డిజిటల్ పౌరుల' హక్కులను పరిరక్షించే లక్ష్యంతో కొన్ని సవరణలను నోటిఫై చేసింది.

అటువంటి కంటెంట్‌ను అప్‌లోడ్ చేయకుండా వినియోగదారులను నిరోధించడానికి సహేతుకమైన ప్రయత్నాలు చేయడానికి మోడరేటర్‌లపై సవరణలు చట్టపరమైన బాధ్యతను విధించాయి.దీంతో.. అప్పటి నుంచి ఇవి నకిలీ, స్పామ్, తప్పుడు అకౌంట్లపై కొరఢా ఝుళిపిస్తున్నాయి. నెలకు లక్షల్లో వాట్సాప్ ఖాతాల్ని బ్యాన్ చేస్తుండటం విశేషం. ఐటీ చట్టానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతోంది.

click me!