కొత్త ఆదాయ పన్ను విధానం ఆకర్షణీయం: కేంద్ర బడ్జెట్ 2023పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

By narsimha lode  |  First Published Feb 1, 2023, 8:25 PM IST

కేంద్ర బడ్జెట్ లో   పర్యాటకం, కనెక్టివిటీపై  కేంద్రీకరించినట్టుగా  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  చెప్పారు. 
 


న్యూఢిల్లీ:మధ్యతరగతి , మౌలిక సదుపాయాలపై  బడ్జెట్ లో కేంద్రీకరించినట్టుగా  కేంద్ర  ఆర్ధిక  మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.  బుధవారం నాడు సాయంత్రం  కేంద్ర ఆర్ధిక మంత్రి  నిర్మలా సీతారామన్   న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.  మహిళలకు  సాధికారిత, పర్యాటకం,  సంప్రదాయ వృత్తులు  చేసే వారికి  సహయం  చేసే విషయమై  బడ్జెట్ లో  అధిక ప్రాధాన్యత  ఇచ్చినట్టుగా  కేంద్ర ఆర్ధిక శాఖమంత్రి  నిర్మలా సీతారామన్  చెప్పారు.  మహిళలు , యువతకు  సాధికారిత కల్పించే దిశగా  కేటాయింపులున్నాయని   కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  వివరించారు.  పర్యాటకం, కనెక్టివిటికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా  ఆమె తెలిపారు.   వ్యవసాయం, వ్యవసాయ సాంకేతికతపై  బడ్జెట్ లో  కేటాయింపులు కూడా పెంచినట్టుగా  కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  చెప్పారు.

 ఆదాయపన్నుకు సంబంధించి కొత్త పన్ను  విధానం  ప్రస్తుతం  డిఫాల్ట్ విధానంగా  ఉంటుందని  మంత్రి తెలిపారు.  అయితే  పాత పన్ను విధానంలో  ఉన్న వారు కొత్త పన్నును  ఎంచుకోవచ్చన్నారు.  ఎంపిక చేసుకున్నవారికే  కొత్త ఆదాయ పన్ను  స్లాబ్  వర్తించనుందని  కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  వివరించారు. ఈ బడ్జెట్  ఆర్ధిక వ్యవస్థను మరింత బలోపేతం  చేయనుందని  కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  చెప్పారు. 

Latest Videos

click me!