
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన నైట్ క్లబ్‌లో ఉన్న వీడియో ఈ రోజు ఉదయం నుంచి తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోను షేర్ చేసిన బీజేపీ నేతలు.. రాహుల్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడతున్నాయి. మరోవైపు సంక్షోభంలో ఉన్న కాంగ్రెస్‌ను పట్టించుకోకుండా.. రాహుల్ గాంధీ పార్టీలో ఎంజాయ్ చేస్తున్నారని పలువురు విమర్శలు చేస్తున్నారు. కీలక సమయాల్లో పార్టీని పట్టించుకోకుండా రాహుల్ ఈ రకమైన టూర్‌లకు వెళ్లడం కొత్తేమీ కాదనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
రాహుల్ గాంధీ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కాంగ్రెస్ సీనియర్ నేత Randeep Surjewala మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫ్రెండ్ పెళ్లి కోసం రాహుల్ గాంధీ నేపాల్ వెళ్లాడని తెలిపారు. ఫ్యామిలీ కార్యక్రమాల్లో పాల్గొనడం నేరం కాదని అన్నారు. ప్రధాని మోదీలాగా రాహుల్ ఆహ్వానం లేని అతిథిగా పాకిస్థాన్‌కు వెళ్లలేదని బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కానీ రాహుల్ గాంధీ ప్రైవేట్ వివాహ కార్యక్రమంలో పాల్గొనడానికి మిత్రదేశమైన నేపాల్‌కు వెళ్లారని చెప్పారు.
విద్యుత్ సంక్షోభం, ద్రవ్యోల్బణం వంటి వాటికి సంబంధించిన ప్రశ్నలకు బీజేపీ ఎందుకు సమాధానం చెప్పడం లేదని సుర్జేవాలా ప్రశ్నించారు. వారు రాహుల్ గాంధీకి మాత్రం మొత్తం సమయాన్ని కేటాయిస్తున్నారని ఎద్దేవా చేశారు. అదే సమయంలో ఆరెస్సెస్‌పై కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆరెస్సెస్.. కుటుంబాన్ని కలిగి ఉండటాన్ని విభేదించవచ్చే వ్యంగ్యస్త్రాలు సంధించారు.
ఇక, బీజేపీ ఐటీ సెల్ ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వియా చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ స్పందించారు. రాహుల్ గాంధఈ వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యాడని.. అందులో తప్పేముందని ప్రశ్నించాురు. ఆయన గురించి సంఘీలు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. సంఘీలు అసత్యాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. మనందరం కూడా ప్రైవేటు ఫంక్షన్లకు హాజరవుతామని పేర్కొన్నారు.
రాహుల్ వీడియోను బీజేపీ వైరల్ చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి. రాహుల్ పార్టీకి హాజరయ్యాడని.. అందులో ఎక్కడ కూడా అసభ్యంగా ప్రవర్తించలేదని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. అందులో తప్పుపట్టాల్సిన అంశం ఏముందని ప్రశ్నిస్తున్నాయి.
ఇక, రాహుల్ గాంధీ సోమవారం విస్తారా ఎయిర్‌లైన్స్ విమానంలో ఖట్మాండ్‌కు వెళ్లారు. ఆయనతో మరో ఇద్దరు ముగ్గురు స్నేహితులు కూడా ఉన్నట్టుగా నివేదికలు సూచిస్తున్నాయి. నేపాల్‌కు చెందిన సుమ్నిమా ఉదాస్ వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ ఖాట్మండ్‌కు వెళ్లారు. ఆమె గతంలో సీఎన్‌ఎన్ వార్త సంస్థలో కరస్పాండెంట్ పనిచేశారు. ఆమె తండ్రి భీమ్ ఉదాస్.. మయన్మార్‌లో నేపాలీ రాయబారిగా పనిచేశారు. అంతకుముందు, ఆగస్టు 2018లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కైలాష్ మానసరోవర్‌కు వెళ్లే మార్గంలో రాహుల్ గాంధీ ఖాట్మండును సందర్శించారు.