నైట్‌ క్లబ్‌లో రాహుల్ గాంధీ.. సంచలనంగా మారిన వీడియో.. షేర్ చేసిన బీజేపీ నేతలు..

Published : May 03, 2022, 11:54 AM ISTUpdated : May 03, 2022, 01:05 PM IST
నైట్‌ క్లబ్‌లో రాహుల్ గాంధీ.. సంచలనంగా మారిన వీడియో.. షేర్ చేసిన బీజేపీ నేతలు..

సారాంశం

బీజేపీ నేతలు షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై విమర్శలు గుప్పిస్తూ ఆ వీడియోను బీజేపీ నేతలు షేర్ చేశారు. ఆ వీడియోలో రాహుల్ గాంధీ ఓ నైట్ క్లబ్‌లో ఉన్నట్టుగా కనిపిస్తుంది.

బీజేపీ నేతలు షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై విమర్శలు గుప్పిస్తూ ఆ వీడియోను బీజేపీ నేతలు షేర్ చేశారు. ఆ వీడియోలో రాహుల్ గాంధీ ఓ నైట్ క్లబ్‌లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఆ వీడియోను ఎప్పటిదనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఈ వీడియోను షేర్ చేసిన నేతల్లో బీజేపీ ఐటీ సెల్ ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వియా కూడా ఉన్నారు. కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్థిగా చెప్పుకునే వ్యక్తి నైట్ క్లబ్‌ల వెంట తిరగమేమిటని ప్రశ్నించారు. అయితే ఈ వీడియో ఎవరూ తీశారనే విషయంలో కూడా స్పష్టత లేదు. కానీ నివేదికల ప్రకారం.. ఈ వీడియోను ఖాట్మండులో చిత్రీకరించినట్టుగా చెబుతున్నారు. అయితే రాహుల్ గాంధీ వీడియో ఆయన సన్నిహిత వర్గాల నుంచే లీక్ అయి ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది. 

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనపై విమర్శలు ప్రారంభించిన మరుసటి రోజే రాహుల్ గాంధీ పబ్‌లో ఉన్నట్టుగా చెబుతున్న వీడియో బయటకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో.. ‘‘దేశంలో సంక్షోభం ఉంది, కానీ 'సార్' విదేశాలలో ఉండటానికి ఇష్టపడతాడు!’’ అని పేర్కొంది. 

 

ఇక, తాజాగా రాహుల్ వీడియో బయటకు రావడంతో  బీజేపీ నేతలు, ఆ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగుతున్నారు. రాజస్తాన్ కాంగ్రెస్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్న సమయంలో రాహుల్ దేశంలో లేకుండా పోయారని విమర్శిస్తున్నారు. ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌తో చర్చలు జరిపిన సమయంలో కూడా రాహుల్ గాంధీ  దేశంలో లేడని కొందరు గుర్తుచేస్తున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోకపోవడం రాహుల్ గాంధీకి అలవాటేనని విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్తాన్ జోధ్‌పూర్‌లో అల్లర్లు జరుగుతుంటే.. రాహుల్ ఇలా నైట్ క్లబ్‌ల వెంట తిరగడమేమిటని కామెంట్స్ చేస్తున్నారు.

 

 

 

ఇక, ఈ వీడియోను షేర్ చేసిన బీజేపీ నేత Tajinder Bagga ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలపాలని అనుకుంటున్నానని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో సంక్షోభంలో ఉన్నప్పుడు.. సార్ విదేశాల్లో ఉండటానికి ఇష్టపడతాడని కాంగ్రెస్ ట్వీట్ చేయడం ద్వారా వారి సొంత నాయకుడి గురించి నిజాలను చెప్పిందని ఎద్దేవా చేశారు.  కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీపై కాకుండా రాహుల్ గాంధీపై ట్వీట్లు చేస్తోందని ఆరోపించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu