సామాజిక దూరం ఎక్కడ..? నిఖిల్ పెళ్లి పై విమర్శలు

By telugu news teamFirst Published Apr 17, 2020, 1:32 PM IST
Highlights
మొదట నిఖిల్‌ పెళ్లిని వైభవంగా వంద ఎకరాల స్థలంలో అయిదు లక్షల మంది కార్యకర్తల సమక్షంలో చేయాలని భావించారు. కాని కరోనా కారణంగా మొత్తం ప్లాన్‌ రివర్స్‌ అయ్యింది.కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ పెళ్లిని జరిపించారు. 
కన్నడ హీరో నిఖిల్‌ గౌడ వివాహం వాళ్లు అనుకన్న విధంగా జరిగిపోయింది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా దేశంలో లక్షలాది మంది పెళ్లిళ్లు, శుభకార్యాలు వాయిదా పడ్డాయి. తెలుగు హీరోలు నిఖిల్, నితిన్ లు కూడా పెళ్లి వాయిదా వేసుకున్నారు.

కానీ కన్నడ హీరో నిఖిల్ గౌడ మాత్రం ఆరు నూరైనా పెళ్లి జరగాల్సిందే అన్నారు. అనుకున్నట్లుగానే శుక్రవారం ఉదయం పెళ్లి తంతు ముగించారు. అయితే.. ఇప్పుడు వీరి పెళ్లిపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. 

రామనగర లోని  ఒక ఫామ్‌ హౌస్‌లో ఈ పెళ్లిని నిర్వహించారు. అతికొద్ది మంది బంధువుల మధ్య పెళ్లి చేసుకుంటున్నామంటూ కుమారస్వామి ప్రకటించారు. అయితే.. పెళ్లి తర్వాత బయటకు వచ్చిన ఫోటోలను చూస్తుంటే మాత్రం ఎలాంటి రూల్స్ పాటించకుండా పెళ్లిళ్లు చేసుకున్నట్లు స్పష్టంగా అర్థమౌతోంది.

మొదట నిఖిల్‌ పెళ్లిని వైభవంగా వంద ఎకరాల స్థలంలో అయిదు లక్షల మంది కార్యకర్తల సమక్షంలో చేయాలని భావించారు. కాని కరోనా కారణంగా మొత్తం ప్లాన్‌ రివర్స్‌ అయ్యింది.కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ పెళ్లిని జరిపించారు. 

అందుకు కూడా ప్రభుత్వం అనుమతిని మొదట నిరాకరించడంతో కుమారస్వామి స్వయంగా రంగంలోకి దిగి ముఖ్యమంత్రి యడ్యూరప్పతో మాట్లాడి కండీషన్స్‌తో కూడిన అనుమతిని పొందినట్లుగా తెలుస్తోంది.

ప్రతి ఒక్కరు కూడా మాస్క్‌లు ధరించడంతో పాటు ఖచ్చితంగా సామాజిక దూరం పాటిస్తూ, ఎక్కువ సమయం పెళ్లి హడావుడి లేకుండా కేవలం గంటలోనే ముగించేలా పెళ్లి జరపాలని ప్రభుత్వం ఆదేశించిందట.పెళ్లికి ఇతరులు ఎవరు వచ్చినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారట.

అయితే.. ఈ రూల్స్ పాటించకుండా పెళ్లి జరిపారు. ఆ పెళ్లిలో ఎక్కడా కనీసం సామాజిక దూరం కూడా ఎవరూ పాటించలేదు. ఒక్కరి మూతికి కూడా మాస్క్ లు లేవు. పెళ్లి మండపం మాత్రం చాలా గ్రాండ్ గా డెకరేట్ చేస్తారు. ఇప్పుడు ఈ పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో విమర్శలు ఎక్కువయ్యాయి. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
click me!