తెలంగాణ భేష్: ఆర్బీఐ గవర్నర్ ప్రకటన ముఖ్యాంశాలు ఇవీ

By narsimha lode  |  First Published Apr 17, 2020, 11:30 AM IST

కరోనా లాక్‌డౌన్ సమయంలో  తెలంగాణ రాష్ట్రం సహ  కోన్ని రాష్ట్రాలు తీసుకొన్న చర్యలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రశంసించారు.
 



న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్ సమయంలో  తెలంగాణ రాష్ట్రం సహ  కోన్ని రాష్ట్రాలు తీసుకొన్న చర్యలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రశంసించారు.

శుక్రవారం నాడు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ముంబైలో మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్  వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రం ఈ ఏడాది మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉంది. దీంతో దేశ ఆర్దిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీసుకొన్న చర్యల గురించి ఆయన వివరించారు.

Latest Videos

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటన ముఖ్యాంశాలు

* 2021-22 లో 7.4 జీడీపీ వృద్దిరేటు ఉంటుందని అంచనా

*ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాం

* జీ20 దేశాల కంటే ఇండియా జీడీపీ అధికం

*రివర్స్ రెపో రేటు 4 నుండి 3.75 శాతానికి తగ్గింపు

*రాష్ట్రాలకు 60 శాతం డబ్ల్యూఎంఏ పెంపు

*మారటోరియం పీరియడ్‌లో 90 రోజుల ఎన్‌పీఏ వర్తించదు

*లాక్‌డౌన్ కారణంగా 30 శాతం విద్యుత్ డిమాండ్ తగ్గింది

* 1930 నాటి ఆర్థిక సంక్షోభాన్ని ప్రస్తుతం చూస్తున్నాం

* జీ20 దేశాల్లో భారత్ జీడీపినే అధికం

* ఆటోమొబైల్ రంగం తీవ్ర నష్టాలను చవి చూస్తోంది

* ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి అందుబాటులోకి రూ.50 వేల కోట్ల నిధులు

* తయారీ రంగం 4 నెలల కనిష్టానికి పడిపోయింది.

* జాతీయ హౌసింగ్ బోర్డుకు రూ.10 వేల కోట్లు

* నాబార్డుకు రూ. 25 వేల కోట్లు

* లఘు పరిశ్రమలకు రూ. 50 వేల కోట్లు

* మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు రూ. 50 వేల కోట్లు

* రెపోరేటు యధాతథంగా ఉంటుంది.

* ప్రపంచ జీడీపీకి 9 ట్రిలియన్ డాలర్ల నష్టం

* బ్యాంకులకు నిధుల కొరత లేకుండా చర్యలు

* తయారీ రంగం 4 నెలల కనిష్టానికి పడిపోయింది

* ఆటోమొబైల్ రంగం తీవ్ర నష్టాల్లో ఉంది

* దేశంలో 91 శాతం ఏటీఎంలు పనిచేస్తున్నాయి

* జీడీపీలో 3.2 శాతం ద్రవ్యం విడుదల

click me!