నన్ను.. తోసేసి లాఠీఛార్జీ చేశారు: పోలీసుల తీరుపై రాహుల్ ఫైర్

By Siva KodatiFirst Published Oct 1, 2020, 3:44 PM IST
Highlights

హత్రాస్ అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఉత్తరప్రదేశ్ పోలీసులు సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు. 

హత్రాస్ అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఉత్తరప్రదేశ్ పోలీసులు సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు. 

దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. తాము హత్రాస్‌కు నడిచైనా సరే వెళ్తామని చెప్పడంతో రాహుల్, ప్రియాంకలను తప్పనిసరి పరిస్ధితుల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.

దీనిపై రాహుల్ మాట్లాడుతూ.. పోలీసులు తనను తోసేసి లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు. సామాన్యుడికి రోడ్డుపై నడిచే హక్కు లేదా అని ఆయన ప్రశ్నించారు. కేవలం మోడీ ఒక్కరే రోడ్డుపై నడవాలా అని ఆయన నిలదీశారు.

యూపీలో మహిళలకు రక్షణ లేదని ప్రియాంక గాంధీ ఆరోపించారు. మరోవైపు రాహుల్, ప్రియాంకల అరెస్ట్‌ల అరెస్ట్‌తో కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. యూపీలో యోగి సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అటు ఈ ఘటనపై ముగ్గురు సభ్యుల సిట్ బృందం దర్యాప్తు ప్రారంభించింది. వారం రోజుల్లో సిట్ బృందం నివేదిక సమర్పించాల్సి వుంది.

మరోవైపు హత్రాస్ సరిహద్దులను పోలీసులు మూసివేశారు. అక్కడ 144 సెక్షన్ విధించారు. అటు మృతురాలి పోస్ట్‌మార్టం నివేదికలో దారుణమైన విషయాలు బయటపడ్డాయి. అత్యాచారం చేసి ఆ తర్వాత దారుణంగా హింసించి చంపినట్లు రిపోర్టులో వెల్లడైంది.

మరోవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెంటనే యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకోవాలని, లేదంటే రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. 

click me!