అగ్నిపథ్ స్కీం ఏమిటి? ఎప్పుడు అప్లై చేసుకోవాలి? ఎంత జీతం?

Published : Jun 14, 2022, 04:20 PM ISTUpdated : Jun 14, 2022, 04:24 PM IST
అగ్నిపథ్ స్కీం ఏమిటి? ఎప్పుడు అప్లై చేసుకోవాలి? ఎంత జీతం?

సారాంశం

కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భారీ మార్పును తీసుకువచ్చింది. యువతను ఆర్మీ వైపు ఆకర్షించేలా నాలుగేళ్ల షార్ట్ సర్వీస్ స్కీమ్‌ను ప్రకటించింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అగ్నిపథ్ స్కీంను ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్ కోసం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సరికొత్త విధానాన్ని ప్రకటించారు. ఆర్మీలో కొన్నాళ్లైనా సేవలు అందించాలని కలలు కనే యువతకు నిజంగా గుడ్ న్యూస్ చెప్పారు. వారి కోసమే అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను ప్రకటించారు. ఈ స్కీం ఏమిటీ? ఎవరు అర్హులు? ఎప్పుడు అప్లై చేసుకోవాలి? జీతం ఎంత వరకు వస్తుంది? అనే కొన్ని కీలక విషయాలను ఇప్పుడు చూద్దాం.

అ్నగిపథ్ స్కీం ఏమిటీ?
ఇది ఆర్మీలో షార్ట్ టర్మ్ సర్వీస్ కోసం యువతకు ప్రకటించిన పథకం. ఈ స్కీం కింద ఆర్మీ, నేవి, వైమానిక దళాల్లో నిర్ణీత కాలం పాటు సేవలు అందించడానికి యువతను రిక్రూట్‌మెంట్ చేసుకునే పథకం. ఈ పథకం కింద రిక్రూట్ చేసుకున్న యువతకు శిక్షణ ఇచ్చి త్రివిధ దళాల్లో నాలుగేళ్లపాటు బాధ్యతలు ఇస్తారు. ఈ పథకం కింద రిక్రూట్ అయినవారినే అగ్నివీర్స్ అంటారు.

ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు?
17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల లోపున్న అభ్యర్థులు ఈ స్కీం కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ స్కీం కింద ఎంపికైన వారికి కఠిన శిక్షణ ఇస్తారు. ఎలాంటి భౌగోళిక వాతావరణంలోనైనా అంటే ఎడారులు, కొండలు, సముద్రంతోపాటు ఆకాశంలో విధులు నిర్వర్తించడానికి ఎంచుకోవచ్చు. అయితే, మహిళలకు ఇప్పుడే అవకాశం లేదు. త్వరలోనే వారు కూడా ఈ స్కీం కింద దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తారు.

ఈ స్కీం కింద ఎన్నేళ్ల టెన్యూర్ ఉంటుంది?
అగ్నిపథ్ స్కీం కింద రిక్రూట్ చేసుకున్నవారు నాలుగేళ్లపాటు ఆర్మీలో సేవలు అందించవచ్చు. ఆ తర్వాత పర్మినెంట్ క్యాడర్ కోసం కూడా స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకోవచ్చు. నాలుగేళ్ల కాలంలో వారి ప్రదర్శన, మెరిట్ల ఆధారంగా పర్మినెంట్ సర్వీస్ కోసం ఎంపిక చేస్తారు. 25 శాతం దరఖాస్తులను పర్మినెంట్ క్యాడర్ కోసం పరిగణించే అవకాశం ఉన్నది.

జీతం ఎంత?
స్టార్టింగ్ వార్షిక ప్యాకేజీ రూ. 4.76 లక్షలు ఉంటుంది. నాలుగేళ్ల సర్వీసు ముగిసే సమయానికి ఈ వార్షిక ప్యాకేజీని రూ. 6.92కు పెంచవచ్చు. ఈ వేతనంతోపాటు ఇతర అలవెన్సులు ఉంటాయి. కాంట్రిబ్యూషన్ లేకుండా ఇన్సూరెన్స్ కవర్ అవకాశం కల్పిస్తారు.

ఎప్పుడు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
అగ్నిపథ్ స్కీంను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళే ప్రకటించారు. అయితే ఈ స్కీం కోసం దరఖాస్తులను త్వరలోనే స్వీకరించవచ్చు. ఇంకా నోటిఫికేషన్ వెలువడాల్సి ఉన్నది. అయితే, ఈ స్కీం కింద ఖాళీలు, జాయినింగ్ ప్రాసెస్ వివరాలు joinindianarmy.nic.in, 
joinindiannavy.gov.in, careerindianairforce.cdac.inలలో అందుబాటులో ఉంచుతారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం