
మూడో ప్రియుడితో తమ భార్య పారిపోయిందని ఇద్దరు భర్తలు స్టేషన్ కు రావడంతో ఆ పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. తమ భార్యను కనిబెట్టి తీసుకురావాలని ఫిర్యాదు చేశారు. నాగ్ పూర్ లోని భరోసా పోలీసు స్టేషన్ లో వీరద్దరు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు.
Uttar Pradesh: యూపీలో కూల్చివేతలపై జోక్యం చేసుకోండి.. సుప్రీంకోర్టుకు మాజీ న్యాయమూర్తుల లేఖ !
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ మహిళ కొంత కాలం క్రితం ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పెళ్లైన నాలుగేళ్ల తరువాత ఆమెకు గుర్తు తెలియని నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. తరువాత వారిద్దరికీ మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది. రెండు సంవత్సరాల క్రితం నాగపూర్ సమీపంలో ఉన్న ఓ దేవాలయంలో వీరద్దరు వివాహం చేసుకున్నారు.
మొదటి భర్త మేస్త్రీ కాగా.. రెండో భర్త ఆప్టిక్ ఫైబర్ వేయడంలో నిపుణుడు. అయితే కొంత కాలం తరువాత ఇరవయేళ్ల వయస్సున్న మహిళ తన స్వస్థలానికి వెళ్లాలనే నెపంతో రెండో భర్త నుంచి వెళ్లిపోయింది. సోషల్ మీడియా ద్వారా ఆమె మూడవ వ్యక్తితో స్నేహం చేసినట్లు సమాచారం. అతడిని కూడా పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. భరోసా సెల్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. మూడో ప్రేమికుడికి గుణపాఠం నేర్పడానికి రెండో భర్త మొదటి భర్తతో కలిసి ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే రెండో భర్త మొదటి భర్తను ఎలాగోలా కనుగొన్నాడు. తరువాత పోలీసులను ఆశ్రయించాలని ఒప్పించాడు. దాని కంటే ముందే రెండో భర్త మొదట సోనేగావ్ పోలీసులను ఆశ్రయించాడు. వారు ఇద్దరు కలిసి నాన్ కాగ్నిజబుల్ నేరాన్ని దాఖలు చేశారు.
సినిమా చూసి కన్నీటి పర్యంతమైన సీఎం బసవరాజు బొమ్మై.. ఎందుకో తెలుసా?
కాగా రెండో భర్త ఆ మహిళను తిరిగి తన జీవితంలోకి తీసుకురావాలని అనుకుంటున్నాడనీ, కానీ మొదటి భర్త దానికి సిద్దంగా లేడని భరోసా సెల్ ఇంఛార్జ్ సీనియర్ ఇన్స్ పెక్టర్ సీమా సుర్వే తెలిపారు. ‘‘ భరోసా సెల్ ఫిర్యాదును నమోదు చేయలేదు. కానీ మేము సోనేగావ్ పోలీస్ స్టేషన్ ను సంప్రదించి మూడో వ్యక్తిపై, మహిళపై ఫిర్యాదు చేయాలని ఇద్దరు వ్యక్తులకు సూచించాం. ఈ కేసులో గృహ హింస లేనందున స్థానిక పోలీసు స్టేషన్ ఈ పరిస్థితిని మరింత మెరుగ్గా చట్టబద్దంగా ఎదుర్కోగలదని మేము భావించాము ’’ అని సీమా సుర్వే ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు తెలిపారు.