ప‌శువుల అక్ర‌మ ర‌వాణ కేసులో మ‌మ‌తా బెన‌ర్జీ సన్నిహిత నాయకుడి అరెస్టు

By Mahesh RajamoniFirst Published Aug 11, 2022, 11:22 AM IST
Highlights

West Bengal: 2020 పశువుల అక్రమ రవాణా కేసులో పశ్చిమ బెంగాల్  ముఖ్య‌మంత్రి మమతా బెనర్జీ స‌న్నిహితులు,  తృణ‌మూల్ కాంగ్రెస్ (టీఎంసీ) బీర్భూమ్ జిల్లా అధ్యక్షులు అనుబ్రతా మోండల్‌ను సీబీఐ గురువారం అరెస్టు చేసింది.
 


2020 cattle smuggling case: పశ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి  మ‌మ‌తా బెనర్జీ సన్నిహితులు, టీఎంసీకి చెందిన బీర్భూమ్ జిల్లా అధ్యక్షులు అనుబ్రతా మోండల్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. 2020 పశువుల అక్రమ రవాణా కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. గురువారం  ఉద‌యం బీర్భూమ్ జిల్లాలోని తన నివాసం ఉన్న ఆయ‌న‌ను సీబీఐ అరెస్టు చేసింది. పశువుల అక్రమ రవాణా కేసులో దర్యాప్తులో భాగంగా మోండల్‌ను కేంద్ర ఏజెన్సీ గతంలో రెండుసార్లు ప్రశ్నించింది.

2020లో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత పశువుల స్మగ్లింగ్ కుంభకోణం కేసులో అతని పేరు తెరపైకి వచ్చింది. సీబీఐ ప్రకారం 2015-2017 మధ్య, 20,000 పశువుల సరిహద్దు గుండా అక్రమంగా రవాణా చేస్తున్నందున సరిహద్దు భద్రతా దళం స్వాధీనం చేసుకుంది. పశువుల స్మగ్లింగ్ కేసుకు సంబంధించి సీబీఐ ఇటీవలి కాలంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మోండల్ అంగరక్షకుడు సైగల్ హొస్సేన్‌ను కూడా దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఇదివ‌ర‌కు ఆయ‌న‌కు పది నోటీసులు పంపిన తర్వాత ఒక్కసారి మాత్రమే హాజరయ్యారు. ప‌లు ఆరోగ్య కార‌ణాలు చూపుతూ ద‌ర్యాప్తున‌కుహాజ‌రుకాలేదు. 

గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో సీబీఐ అధికారులు అనుబ్రతా మోండల్‌ ఇంటికి చేరుకున్నారు. అయితే లోపల నుంచి తాళం వేసి ఉండడంతో సీబీఐ అధికారులు అరగంట పాటు బయటే నిల్చున్నారు.  కొద్ది స‌మ‌యం త‌ర్వాత సీబీఐ అధికారులు ఇంటిలోకి ప్ర‌వేశించారు. సోర్సెస్ ప్రకారం, సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బోల్పూర్‌లోని అనుబ్రతా మోండల్‌ ఇంటికి సెర్చ్ వారెంట్‌తో వచ్చింది. ఓ వైపు ఇంట్లో సోదాలు, మరోవైపు కేష్ట్‌ను విచారిస్తున్నారు. ఇంటి సభ్యుల ఫోన్లు లాక్కున్నారు. ఆవుల స్మగ్లింగ్ కేసులో అనుబ్రతా మోండల్ కు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లుగా సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఆవుల స్మగ్లింగ్ కేసులో ఆయ‌న‌కు బుధవారం కూడా సమన్లు ​​అందాయి. అయితే అతను పదవసారి హాజరుకాలేదు. బుధవారం ఉదయం 11 గంటలకు ఆయన నిజాం ప్యాలెస్‌ను సందర్శించాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా రాలేదు.

సీబీఐ ముందు సోమవారం హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, అనుబ్రత మోండల్ కోల్‌కతాకు వచ్చి ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిని సందర్శించి నేరుగా బోల్‌పూర్‌లోని తన ఇంటికి తిరిగి వెళ్లారు. అతడిని ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని ఎస్‌ఎస్‌కేఎం వైద్యులు తెలిపారు. ఆ తర్వాత మళ్లీ హాజరు కావాలని బీర్భూమ్ జిల్లా తృణమూల్ అధ్యక్షుడికి సీబీఐ నోటీసు పంపింది. దుర్గాపూర్, బోల్‌పూర్‌లలో పోలీసు బలగాలను సిద్ధంగా ఉంచినట్లు సమాచారం. సీబీఐ అధికారులతో పాటు ఓ బ్యాంకు ఉద్యోగిని కూడా అనుబ్రత ఇంటికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అనుబ్రత ఇంటి వద్ద ఎప్పుడూ భద్రత కోసం మోహరించే పోలీసును కూడా లోపలికి అనుమతించరు. అయితే, అతని చీఫ్ సెక్యూరిటీ గార్డు లోపలికి అనుమతించబడ్డాడు. ఆవుల అక్రమ రవాణా కేసులో అనువ్రత మండల్ 10 సార్లు సమన్లను తప్పించారు. దీంతో విచారణ పూర్తి చేసేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని విశ్వసనీయ సమాచారం. 

click me!