గుర్గావ్ లోని ఓ నైట్ క్లబ్ బయట జరిగిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు యువకులను, ఓ మహిళను బౌన్సర్లు చితకబాదారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుర్గావ్లోని ఓ క్లబ్ బయట 6 గురు బౌన్సర్లు ఓ మహిళ, ఆమె స్నేహితులపై అనుచితంగా ప్రవర్తించారు. అర్ధరాత్రి సమయంలో వారందరినీ చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఘటన బయటకు వచ్చిన తరువాత ఆ బౌన్సర్లపై కేసు నమోదు అయ్యింది. వారి ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు.
భారత 14వ ఉపరాష్ట్రపతిగా నేడు జగదీప్ ధంఖర్ ప్రమాణ స్వీకారం
ఈ వీడియోలో 6 గురు బౌన్సర్లు పలువురు పురుషులను లాగుతున్నారు. వారిని కొట్టడం క్లియర్ గా కనిపిస్తోంది. అయితే అందులో ఉన్న వ్యక్తులను కాపాడేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. దీంతో ఆమెను కూడా బలవంతగా లాగారు. ఆమెను కూడా ఆ గొడవలో అనుచితంగా తాకారు. ఈ ఘటనను అంతా ఓ మహిళ రికార్డు చేసింది. ఆ మహిళ కూడా ఈ ఘటనపై పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ వాళ్లకు రక్తం వస్తోంది. దయచేసి ఆపండి ’’ అని కేకలు వేయడం వినిపిస్తోంది. అయినా వారు కొట్టడం మాత్రం ఆపలేదు. మరో వీడియో క్లిప్ లో ఓ బౌన్సర్ కర్రను కూడా ఉపయోగించి వారిపై దాడి చేశారు.
జంతువులు కూడా ఈ ఫుడ్ తినవు.. ఎక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన పోలీసు..!
ఈ ఘటనలో క్లబ్ మేనేజర్‌తో పాటు సోను, మన్దీప్, సుమిత్, నితిన్, రామ్ సింగ్, రాకేష్ అనే ఆరుగురు బౌన్సర్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై గుర్గావ్ పోలీస్ చీఫ్ కళా రామచంద్రన్ మాట్లాడుతూ.. “ ఉద్యోగ్ విహార్‌లోని కాసా డాంజా క్లబ్ వెలుపల కొంతమంది బౌన్సర్లు కొంతమంది యువకులను కొట్టే వీడియో వైరల్ అవుతోంది. బాధితుడితో పాటు ఉన్న మహిళను చెడు ఉద్దేశ్యంతో తాకారని, అలాగే డబ్బులను కూడా లాక్కున్నారని ఫిర్యాదు నమోదు అయ్యింది. ’’ అని తెలిపారు. ఆదివారం అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు.
| Bouncers thrash guests outside Gurgaon club after argument over woman being ‘touched inappropriately’ pic.twitter.com/e2cbS2CRJ2
— The Indian Express (@IndianExpress)ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. బాధితుడు తన స్నేహితులో కలిసి క్లబ్ కు వెళ్లారు. ఆ సమయంలో ఓ సెక్యూరిటీ గార్డు అతడి మహిళా స్నేహితురాలిని అనుచితంగా తాకారు. దీంతో బాధితుడు అక్కడి వెళ్లాడు. వారితో వాదించాడు. దీనిపై మహిళతో కలిసి నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. దీంతో క్లబ్‌లోని బౌన్సర్లందరూ వచ్చి దాడి చేశారు. ‘‘ ఇద్దరు మేనేజర్లు కాకుండా దాదాపు 8-10 మంది నల్ల బట్టలు ధరించిన బౌన్సర్లు మమ్మల్ని రోడ్డు మధ్యలోకి లాగారు. నన్ను కర్రలతో కొట్టేందుకు రోడ్డుపై పడుకోబెట్టారు. వాళ్లు నా తలపై, ముఖంపై కర్రలతో కొట్టారు’’ అని ఫిర్యాదుదారుడు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నాడు.