దేశాన్ని నాశనం చేశారు, బెంగాల్‌ను ఉద్దరిస్తారా? బీజేపీపై మమత ఫైర్

Published : Feb 05, 2021, 04:14 PM IST
దేశాన్ని నాశనం చేశారు, బెంగాల్‌ను ఉద్దరిస్తారా? బీజేపీపై మమత ఫైర్

సారాంశం

దేశాన్ని నాశనం చేసిన బీజేపీ... ఇప్పుడు బెంగాల్ ను బంగారం చేస్తానని వాగ్ధానాలు చేస్తోందని బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఎద్దేవా చేశారు.

కోల్‌కత్తా: దేశాన్ని నాశనం చేసిన బీజేపీ... ఇప్పుడు బెంగాల్ ను బంగారం చేస్తానని వాగ్ధానాలు చేస్తోందని బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఎద్దేవా చేశారు.శుక్రవారం నాడు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు.  రాష్ట్రంలో టీఎంసీకి ప్రత్యామ్నాయం లేదన్నారు. ఆ స్థానాన్ని మరే పార్టీ తీసుకోలేదన్నారు.

తమ ప్రభుత్వంపై బీజేపీ చేస్తోన్న విమర్శలను  ఆమె తిప్పికొట్టారు. తమ ప్రభుత్వం ప్రపంచంలోనే ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలనను అందిస్తున్నట్టుగా చెప్పారు. బీజేపీ ఆటలను రాష్ట్ర ప్రజలు సాగనివ్వరని ఆమె అభిప్రాయపడ్డారు. బీజేపీ వర్గాలే తిరుగుబాటు దారులని ఆమె విమర్శించారు.

త్వరలోనే బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ దఫా ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలను ప్రారంభించింది.ఇప్పటికే పలువురు టీఎంసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు.  దీదీకి ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని బీజేపీ భావిస్తోంది. తన ర్యాలీలను భగ్నం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని కూడ ఆమె ఆరోపించారు.
 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం