భారత ప్రభుత్వం వద్ద దరఖాస్తు: ఫైజర్‌ సంచలన నిర్ణయం

By Siva KodatiFirst Published Feb 5, 2021, 3:33 PM IST
Highlights

కరోనా వైరస్‌‌ను నియంత్రించేందు ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయి. అటు భారతదేశంలో కూడా కొవాగ్జిన్, కోవిషీల్డ్ ‌లను అత్యవసర వినియోగానికి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే

కరోనా వైరస్‌‌ను నియంత్రించేందు ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయి. అటు భారతదేశంలో కూడా కొవాగ్జిన్, కోవిషీల్డ్ ‌లను అత్యవసర వినియోగానికి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో జనవరి 16 నుంచి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ పరిశీలనలో మరికొన్ని వ్యాక్సిన్లు కూడా వున్నాయి.

ఈ క్రమంలో ఫార్మా దిగ్గజం ఫైజర్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో తన కరోనా వ్యాక్సిన్ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ (ఈయూఏ) దరఖాస్తును ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది.

ఫిబ్రవరి 3న జరిగిన భారత డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ సమావేశంలో ఫైజర్ ఈ విషయాన్ని ప్రకటించింది. భారత్‌లో అనుమతి కోసం అధికారులను సంప్రదించిన దాదాపు రెండు నెలల తర్వాత దరఖాస్తును విత్ డ్రా చేసుకుంటున్నట్లు ఫైజర్ శుక్రవారం తెలిపింది.

సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ  సమావేశంలో రెగ్యులేటరీ వ్యాక్సిన్  అదనపు సమాచారాన్ని కోరడంతో ఫైజర్‌ తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ వ్యాక్సిన్ అతితక్కువ సమయంలో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో మరింత అదనపు సమాచారంతో ఇండియాలో అత్యవసర వినియోగ ఆమోదం కోసం మరోసారి దరఖాస్తు చేసుకుంటామని ఫైజర్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

click me!