ఉత్తరాఖండ్ ‘‘భయం’’.. మేల్కొన్న మమత: బెంగాల్‌లో మండలి ఏర్పాటుకు తీర్మానం

By Siva KodatiFirst Published Jul 6, 2021, 5:59 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్‌లో శాసన మండలి ఏర్పాటు చేయాలన్న తీర్మానాన్ని ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా లేకుండా సీఎంగా కొనసాగుతున్నారు మమతా బెనర్జీ. మరో 4 నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి వుంది. అయితే మండలి ఏర్పాటుకు కేంద్ర ఆమోదం తప్పనిసరి అని రాజ్యాంగం చెబుతోంది. 

ఇక ఉత్తరాఖండ్ విషయానికి వస్తే.. ఎంపీగా ఉన్న తీరత్‌ను బీజేపీ అధిష్ఠానం నాలుగు నెలల కిందట త్రివేంద్ర సింగ్ రావత్ స్థానంలో సీఎంగా నియమించింది. దీంతో ఆయన ఆరు నెలల్లోపే శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంది. ప్రస్తుతం నాలుగు నెలలు పూర్తికాగా.. సెప్టెంబర్‌ 10 నాటికి ఆరు నెలలు అవుతుంది. అయితే, రాష్ట్రంలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం కరోనా ఉద్ధృతి కారణంగా ఉప ఎన్నికలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడకుండా తీరత్ సింగ్ రాజీనామా చేశారు. 

Also Read:ఉత్తరాఖండ్‌ సీఎం తీరత్ సింగ్ రాజీనామా

దేశంలో మరోసారి కరోనా థర్డ్ వేవ్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో బెంగాల్‌లో కూడా ఎన్నికలు వాయిదా పడే అవకాశం వుంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరాఖండ్ పరిణామాలతో మమత వేగంగా పావులు కదిపారు. రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటుకు వెంటనే అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మరి మమత డిమాండ్‌కు కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందన్నది తెలియాల్సి వుంది. 

click me!