రాజకీయాల్లోకి వాద్రా...ఇక్కడి నుంచి పోటీ చేయాలంటూ పోస్టర్లు

Siva Kodati |  
Published : Feb 25, 2019, 06:11 PM ISTUpdated : Feb 25, 2019, 06:12 PM IST
రాజకీయాల్లోకి వాద్రా...ఇక్కడి నుంచి పోటీ చేయాలంటూ పోస్టర్లు

సారాంశం

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా...రాజకీయాల్లో ఆసక్తి ఉందని, త్వరలోనే ఎంట్రీ ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ కొన్నిచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు పోస్టర్లు కడుతున్నారు.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా...రాజకీయాల్లో ఆసక్తి ఉందని, త్వరలోనే ఎంట్రీ ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ కొన్నిచోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు పోస్టర్లు కడుతున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌‌ నుంచి రంగంలోకి దిగాలంటూ నగరంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పోస్టర్లు ఏర్పాటు చేశారు.

‘‘ రాబర్ట్ వాద్రాజీ... మొరాదాబాద్ నుంచి లోక్‌సభకు పోటీ చేసేందుకు మీకు స్వాగతం’’ అంటూ బ్యానర్లలో పేర్కొన్నారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పోస్టర్లు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.    

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు