కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు గాను వీకెండ్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. 30 శాతం సామర్ధ్యంతో సినిమా ధియేటర్లకు అనుమతించింది
కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు గాను వీకెండ్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. 30 శాతం సామర్ధ్యంతో సినిమా ధియేటర్లకు అనుమతించింది. ఆడిటోరియాలు, జిమ్‌లు, మాల్స్, మార్కెట్లను సైతం వారాంతాల్లో మూసివేయాలని ఆదేశించింది. ఢిల్లీలో అత్యవసర, నిత్యావసర సేవలకు మాత్రమే అనుమతించింది.
అంతకుముందు మీడియాతో మాట్లాడిన సీఎం కేజ్రీవాల్.. ఢిల్లీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ టీకా అందించేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
undefined
కరోనా వ్యాప్తిని కట్ చేయాలంటూ ప్రతిఒక్కరికీ టీకా ఇవ్వడం తప్పదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశామని కేజ్రీవాల్ గుర్తుచేశారు.
Also Read:మహారాష్ట్ర: అమల్లోకి జనతా కర్ఫ్యూ.. ఇళ్లకు జనం పరుగులు, కిక్కిరిసిన రోడ్లు
ఢిల్లీలోని ప్రతిఒక్కళ్లూ టీకా వేయించుకునేలా ఇంటింటికీ తిరిగి ప్రచారం కల్పిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని కరోనా బాధితుల్లో 65 శాతం మంది 45 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారే అని వెల్లడించారు.
ఢిల్లీ ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన డేటా మేరకు… 24 గంటల వ్యవధిలో 17,282 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్థారణకాగా…104 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50,736 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 1,08,534 కోవిడ్ టెస్ట్‌లు చేపట్టగా…వీటిలో ఏకంగా 15.92 శాతం మేర పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి.