
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నది. పతనం అంచున ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు శివసేన తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఆ పార్టీకి చెందిన దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా.. అందులోని 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కి శివసేన అప్పీల్ చేసింది.
ప్రస్తుతం గౌహతి క్యాంప్ లో దాదాపు 40 రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో ఏక్నాథ్ షిండే, తానాజీ , సావంత్, మహేష్ షిండే, అబ్దుల్ సత్తార్, సందీపన్‌రావ్ బుమ్రే, భరత్‌షేత్ గోగావాలే, సంజయ్ శిర్సత్, యామిని జాదవ్, లతా చంద్రకాంత్, అనిల్ బాబర్, ప్రకాష్ సర్వే, బాలాజీ కినికర్ వంటి వాళ్లు ఉన్నారు.
12 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శివసేన ప్రయత్నిస్తోంది. ఈ చర్యపై తిరుగుబాటుదారుడు ఏక్‌నాథ్ షిండే నుండి ఘాటైన స్పందన వచ్చింది. తన వర్గాన్ని నిజమైన శివసేనగా అభివర్ణిస్తూ.. తాము ఎవరి బెదిరింపులకు భయపడమని తేల్చి చెప్పాడు. వరుసగా ట్వీట్లు చేస్తూ.. ‘‘ఎవరిని భయపెట్టాలని చూస్తున్నారు? మీ వ్యూహాలు, చట్టం మాకు తెలుసు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం.. విప్ పవర్ కేవలం అసెంబ్లీ వ్యవహారాలకు మాత్రమేననీ, సమావేశానికి కాదు అని తెలిపారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు అనేకం ఉన్నాయని మరో ట్వీట్ లో పేర్కొన్నారు.
నిన్న.. శివ సేన తిరుగుబాటుదారులకు అల్టిమేటం జారీ చేసింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తన అధికారిక నివాసం "వర్ష"లో సాయంత్రం 5 గంటలకు పిలిచిన సమావేశానికి హాజరు కాలేకపోతే అనర్హత వేటు వేసింది. శివసేన కొత్తగా నియమితులైన లెజిస్లేచర్ పార్టీ నాయకుడు అజయ్ చౌదరి, హాజరుకాని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాశారు. మంగళవారం ఏకనాథ్ షిండే తిరుగుబాటు తర్వాత, మహారాష్ట్ర అసెంబ్లీలో పార్టీ శాసనసభా పక్ష నేత పదవి నుంచి శివసేన షిండేను తొలగించడం గమనార్హం.
ఈ విషయంపై శివసేన ఎంపీ అరవింద్ సావంత్ మాట్లాడుతూ.. బుధవారం సమావేశానికి హాజరుకానందున 12 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ స్పీకర్‌కు పిటిషన్ వేశామని తెలిపారు. వారి తప్పిదం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందనీ, వారి సభ్యత్వం రద్దు చేస్తామని తెలిపారు.
ఏకనాథ్ షిండే ఎదురుదాడి
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శివసేన ప్రయత్నిస్తోంది. ఈ విషయంపై తిరుగుబాటు ఎమ్మెల్యే ఏకనాథ్ షిండే కీలక ప్రకటన చేశారు. తమని భయపెట్టలేరని షిండే అన్నారు. ఎందుకంటే గౌరవనీయులైన శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రేకి తాము నిజమైన అనుచరులమనీ, తాము శివ సైనికులమని తెలిపారు. తమని ఎవరూ భయపెట్టాలేరనీ, భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు ప్రకారం విప్ అనేది శాసనసభ వ్యవహారాలకే తప్ప సమావేశాలకు కాదనీ, ఈ విషయంలో సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చిందని పేర్కొన్నారు..