Weather Update: ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు.. ఐఎండీ హెచ్చరిక‌లు జారీ

Published : Aug 29, 2023, 12:37 AM IST
Weather Update: ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు.. ఐఎండీ హెచ్చరిక‌లు జారీ

సారాంశం

Weather Update: రానున్న మూడు రోజుల్లో దేశంలోని ప‌లు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) అంచ‌నా వేసింది. ఇదే స‌మ‌యంలో ప‌లు చోట్ల సాధార‌ణ వ‌ర్ష‌పాతం న‌మోద‌వుతుంద‌ని తెలిపింది.  ఆగస్టు 31 వరకు ప‌లు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.  

IMD predicts heavy rainfall: రానున్న మూడు రోజుల్లో దేశంలోని ప‌లు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) అంచ‌నా వేసింది. ఇదే స‌మ‌యంలో ప‌లు చోట్ల సాధార‌ణ వ‌ర్ష‌పాతం న‌మోద‌వుతుంద‌ని తెలిపింది.  ఆగస్టు 31 వరకు ప‌లు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

వివ‌రాల్లోకెళ్తే.. గురువారం వరకు భారతదేశంలోని ఈశాన్య, తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం అంచనా వేసింది. ఆగస్టు 28 నుంచి 31 వరకు అస్సాం, మేఘాలయలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరం, అండమాన్ నికోబార్ దీవుల్లో ఆగస్టు 28 నుంచి 31 వరకు భారీ వర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ తెలిపింది. 

ఈ వారం రోజుల పాటు దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో మందకొడి వర్షపాతం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తన అంచనాలో పేర్కొంది. పశ్చిమ అస్సాం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం, హిమాలయాల దిగువ ప్రాంతాల గుండా ప్రవహించే రుతుపవనాల ద్రోణి ఇందుకు కారణమని ఐఎండీ పేర్కొంది. వీటితో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆగస్టు 28న సోమ‌వారం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, కోస్తాంధ్ర, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, పుదుచ్చేరి, కరైకల్, యానాం, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు  కురిశాయి. ఆగస్టు 29న అండమాన్ నికోబార్ దీవుల్లో, ఆగస్టు 30,31 తేదీల్లో ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ నెల 28, 29 తేదీల్లో పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న నైరుతి అరేబియా సముద్రంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. గంటకు 65 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఈ నెల 31, 45 తేదీల్లో వాయువ్య, తూర్పు మధ్య అరేబియా సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ పేర్కొంది. రానున్న మూడు రోజుల పాటు కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?