విమానం రీషెడ్యూల్.. హోటల్ లో బస.. కట్ చేస్తే.. అగ్నికి ఆహుతైన ఎన్నారై నవ దంపతులు..  

Published : Aug 28, 2023, 09:49 PM IST
విమానం రీషెడ్యూల్.. హోటల్ లో బస.. కట్ చేస్తే.. అగ్నికి ఆహుతైన ఎన్నారై నవ దంపతులు..  

సారాంశం

ముంబయిలోని సాంతాక్రూజ్‌ ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోనున్న ఓ జంట ఉందనే విషయం బయటపడింది. 

మూడుముళ్ల బంధంతో ఏకం కావాలనుకున్న యువ జంటపై కాలం కన్నెర చేసింది. విదేశాలకు ప్రయాణమైతున్న వారిని మృత్యువు వెంటాడింది. చివరికి ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకొని ఆ జంట బలైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని శాంత క్రూజ్ ప్రాంతంలోని ఓ హోటల్లో ఆదివారం జరిగిన ఓ అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అగ్నికి ఆహుతి అయిన విషయం తెలిసిందే..

ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు విదేశీయులు కాగా.. ఒకరు భారతీయుడు. అయితే.. తాజాగా ఈ ఘటనలో మరో విషాద అంశం వెలుగులోకి వచ్చింది. మృతులలో మరికొన్ని రోజులలో పెళ్లి చేసుకోనున్న ఓ జంట ఉందన్న విషయం బయటపడింది. వారి వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంతో ఆ హోటల్‌లో స్టే చేయాల్సి వచ్చిందనీ, ఈ సమయంలో ఆ హోటల్ లో సంభవించిన ప్రమాదంలో వారి బలయ్యారనే విషయం వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకెళ్తే.. గుజరాత్ కు చెందిన కిషన్ హలాయ్, అతడి ప్రేయసి రూపాల్ కుటుంబాలు కెన్యా రాజధాని నైరోబిలో స్థిరపడ్డారు. అయితే..ఇటీవల కిషన్ సోదరుడు వివాహం ఇండియాలో జరిగింది. దీంతో వారందరూ నెల రోజుల క్రితం గుజరాత్ కు వచ్చారు. గత వారం పెళ్లి వేడుకలు పూర్తి కావడంతో కిషన్ తల్లిదండ్రులు, నవ జంట కెన్యాకు తిరిగి వెళ్ళిపోయారు. కానీ, కిషన్, రూపాల్ మాత్రం ఇక్కడి బంధువులు, స్నేహితులను కలిసే నిమిత్తం వారి ప్రయాణాన్ని వారం రోజులు ఆలస్యం చేసుకున్నారు.

వారు అనుకున్నట్లుగానే తమ బంధువులను స్నేహితులను కలుసుకొని ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆగస్టు 27న ముంబై ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అయితే.. వారు వెళ్లాల్సిన ఫ్లైట్ రీషెడ్యూల్ అయ్యింది.. దీంతో కిషన్, రూపాల్, ఆమె తల్లి, సోదరి లు ఎయిర్ పోర్ట్ కు సమీపంలోని గెలాక్సీ హోటల్లో స్టే చేశారు. ఈ క్రమంలో ఆ హోటల్లో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో కిషన్, రూపాల్ తో పాటు కాంతిలాల్ అనే మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు గుర్తించారు. రూపాల్ తల్లి, సోదరి తో పాటు మరో వ్యక్తికి తీవ్రగాయాలైనట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంతో వారి కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

PREV
click me!

Recommended Stories

Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu
Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!