తమిళనాడు, కేరళలల్లో భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక

By AN TeluguFirst Published Dec 16, 2020, 10:58 AM IST
Highlights

నివర్, బురేవి తుపాన్ల బీభత్సం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు మరో భారీ వర్ష సూచన వణుకుపుట్టిస్తోంది. వచ్చే రెండు, మూడు రోజుల్లో దక్షిణ భారతంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. 
 
ఈ వర్షాలు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో  ఎక్కువ ప్రభావం చూపుతాయని వెల్లడించారు. ఈ మేరకు వాతావరణశాఖ ట్విటర్‌లో ఒక పోస్టు పెట్టింది. 

తమిళనాడు, పుదుచ్చేరిల్లో 16 నుంచి 18 డిసెంబరు మధ్య, కేరళ, లక్షద్వీప్‌లలో 17 నుంచి 18 డిసెంబరు మధ్య ఈ భారీ వర్షాలు పడతాయన్నారు. డిసెంబరు నెల ప్రారంభంలో వారం రోజుల తేడాతో వచ్చిన నివర్‌, బురేవి తుపాన్ల నుంచి కోలుకుంటున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలను మళ్లీ వర్షాలు హడలెత్తించనున్నాయి.

click me!