దారుణం: భార్య అశ్లీల చిత్రాలను ఫేస్ బుక్ లో పోస్టు చేసిన భర్త

Published : Dec 16, 2020, 09:13 AM ISTUpdated : Dec 16, 2020, 09:14 AM IST
దారుణం: భార్య అశ్లీల చిత్రాలను ఫేస్ బుక్ లో పోస్టు చేసిన భర్త

సారాంశం

ఒడిశాలోని రాయగడ జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య అశ్లీల చిత్రాలను ఫేస్ బుక్ లో పోస్టు చేసి అవమానకరమైన వ్యాఖ్యలు రాశాడు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రాయగడ: ఒడిశాలోని రాయగడ జిల్లాలో ఓ వ్యక్తి అత్యంత నీచమైన కార్యానికి ఒడిగట్టాడు. భార్య అశ్లీల చిత్రాలను ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన రాయగడ జిల్లాలోని గుణపూర్ లో మంగళవారంనాడు జరిగింది. 

బలంగీర్ లోని టిట్లాగఢ్ పరిధిలో గల జగన్నాథ గ్రామానికి చెందిన గోవిందరావుకు తన భార్యతో గత కొంత కాలంగా గొడవలు ఉన్నాయి. భర్త తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ అతని భార్య గుణుపూర్ పోలీసు స్టేషన్ లో కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు గోవింద రావుపై కేసు నమోదు చేసి, అతన్ని కోర్టుకు తరలించారు. 

ఆ తర్వాత బెయిల్ మీద గోవిందరావు విడుదలయ్యాడు. తిరిగి భార్యను వేధించడం ప్రారంభించాడు. దాంతో భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె గుణుపూర్ లోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త దాన్ని సహించలేకపోయాడు. 

భార్య అశ్లీల చిత్రాలను ఫేస్ బుక్ లో పోస్టు చేస్తూ దారుణమైన వ్యాఖ్యలను పెట్టాడు. దాంతో భార్య గుణుపూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి గోవిందరావును అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
నేపాల్ భయానక దృశ్యాలు | Nepal Visuals | Asianet News Telugu