
సనాతన ధర్మానికి చెందిన కూతుళ్లను అవమానించే వారి చేతులు నరికేస్తానని బీజేపీ లోక్ సభ ఎంపీ, కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే అన్నారు. ‘‘సనాతన ధర్మం కూతుళ్లు మన దేశపు కూతుళ్లు. వారి గౌరవంతో ఆడకున్న ఎవరు ఆడుకున్నా వారి చేతులు నరికేస్తాను. అయినప్పటికీ ఆర్జేడీ నేతలు తమ కూతుళ్లను (పెళ్లి కోసం) ఇతర సామాజిక వర్గాల వారికి ఇవ్వాలని అనుకుంటే.. వారు స్వేచ్ఛగా ఆ పని చేయవచ్చు.’’ అని చౌబే అన్నారు.
జీవితంలో ఏమైనా చేయండి.. మీ మాతృభాషను ఎప్పటికీ వదులుకోవద్దు : అమిత్ షా
భారతదేశం హిందూ దేశమని, అది అలాగే ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. బీజేపీ అగ్రనేతలు ఎల్ కే అద్వానీ, మురళీమనోహర్ జోషిల కుమార్తెలు ముస్లిం పురుషులను వివాహం చేసుకున్నారని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) శాసనసభ్యుడు భాయ్ వీరేంద్ర వ్యాఖ్యానించిన మరుసటి రోజే మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
బీజేపీ నేతలు తమ కుమార్తెను ముస్లింల నుంచి కాపాడుకోవాలని భాయ్ వీరేంద్ర అన్నారు. దీనిపై మరో బీజేపీ నేత, ఎమ్మెల్సీ సంతోష్ సింగ్ స్పందిస్తూ.. ‘‘ఆర్జేడీ నేతలు మానసికంగా దివాళా తీశారు. ఏ ముస్లిం యువకుడు అయినా హిందూ సమాజంలోని ఆడబిడ్డల వైపు వేలు చూపిస్తే వారి వేలిని నరికేస్తాను.’’ అని అన్నారు.