ఆ ఉగ్రదాడికి 14 ఏండ్లు: ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలి.. మరింత సమర్థవంతంగా స్పందించాలి..

By Rajesh KarampooriFirst Published Nov 26, 2022, 10:39 PM IST
Highlights

ముంబైలో 2008 నవంబర్ 26 నాటి ఉగ్రదాడికి  నేటితో 14 ఏండ్లు. కాలం మారుతున్న ఆ దాడులు మిగిల్చిన గాయాలు మాత్రం మానడం లేదు. అనేకమంది హృదయాల్లో ఘటన ముద్ర వేసినట్టుగానే ఉండిపోయింది. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకోని, భవిష్యత్తులో రానున్న ఉగ్రవాదులను సమర్థవంతంగా ఎదుర్కొవాలని వైస్ అడ్మిరల్ R P సుతాన్ (రిటైర్డ్) అన్నారు.

పద్నాలుగు సంవత్సరాల క్రితం (నవంబర్ 26, 2008) సరిగా ఈ రోజు దేశ వాణిజ్య రాజధాని ముంబైపై భయంకరమైన ఉగ్రదాడి జరిగింది. భారత్‌పై పాక్ ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. ముంబయి నగరం నడిబొడ్డున నాలుగు రోజుల పాటు మరణహోమం కొనసాగింది. ఈ దాడిలో మొత్తం 173 మంది చనిపోగా 308 మంది వరకూ గాయపడ్డారు. పలువురు జీవచ్ఛవాలుగా మారారు. కాలం మారుతున్న ఆ దాడులు మిగిల్చిన గాయాలు మాత్రం మానడం లేదు. అనేకమంది హృదయాల్లో ఘటన ముద్ర వేసినట్టుగానే ఉండిపోయింది. నేడు వారి త్యాగాలను స్మరించుకుంటూ.. దేశవ్యాప్తంగా నివాళులర్పించారు. 

ఈ నేపథ్యంలో వైస్ అడ్మిరల్ R P సుతాన్ (రిటైర్డ్) ఏసియన్ నెట్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్య్వూలో భారత భద్రత బలగాల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రోజురోజుకు భారతదేశ ఇంటెలిజెన్స్ సమర్థవంతంగా మారుతోందనీ, ఖచ్చితమైన, గుర్తించదగిన నిఘా వ్యవస్థ ఉందని తెలిపారు. సమన్వయంగా,సమయానుకూలంగా ఉగ్రదాడులపై స్పందించగలదనీ, భవిష్యత్తులో సముద్రమార్గం నుంచి ఎదురయ్యే.. ఉగ్రదాడులను సమర్థవంతంగా ఎదుర్కొగలమని అన్నారు.
 
వెనక్కి తిరిగి చూస్తే.. ఆ ఉగ్రదాడిని మరింత సమర్థవంతంగా, మెరుగ్గా ఎదుర్కోగలమని నమ్ముతున్నానని అన్నారు. మన దేశ నిఘా వ్యవస్థ ,భద్రత లోపాల వల్ల ఈ సమస్య తలెత్తింది. ఆ ఘటన గూఢచార్య వ్యవస్థ శక్తి సామర్థ్యాలను, వైఫల్యాలను బహిర్గతం చేసిందని వైస్ అడ్మిరల్ R P సుతాన్ పేర్కొన్నారు. 14 సంవత్సరాల క్రింద జరిగిన మరణహోమాన్ని మదిలో పెట్టుకుని రక్షణ వ్యవస్త మరింత పఠిష్టంగా మారాలి. లోపాలను క్రమానుగతంగా పరీక్షించి.. వాటిని చక్కదిద్దు కోవాల్సిన అవసరం ఉందని అన్నారు.  

సముద్ర నిఘా వ్యవస్థలో మత్స్యకారుల సమాజానికి ప్రత్యేక స్థానం కల్పించాలని అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. వారు సముద్రంలో సైనికులు. అధికారులు ప్రతి మత్స్యకార పడవపై నిఘా ఉంచడం కష్టం. కావున అమలు చేయాల్సిన వివిధ వ్యూహాలలో వారిని కూడా ఉపయోగించుకోవాలని అన్నారు. మత్స్యకారుల సమాజ సహాయంతో తీర ప్రాంతంలో ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించవచ్చని అన్నారు. సముద్ర ఆధారిత చొరబాట్లను నిరోధించడానికి, రక్షించడానికి ఈ సమాచారం అంతా చాలా ముఖ్యం అని అన్నారు. మరో రకంగా చెప్పాలంటే.. ప్రతి ఒక్కరూ దేశ రక్షకులే అనే వాస్తవాన్ని గ్రహించాలని అన్నారు. ఇలాంటి దాడి ఎప్పుడైనా ఎక్కడైనా జరగవచ్చని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

అయితే 2008లో అందుబాటులో లేని ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లు సాధ్యమైనంత వరకు చర్య తీసుకోవాలనేది కూడా నిజమని, అప్పుడు సమాచార భాగస్వామ్యం లేదనీ..  అలాగే ఏజెన్సీల మధ్య సమన్వయం కూడా లేదని అన్నారు. అటువంటి అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే చర్య తీసుకోవడానికి క్విక్ రెస్పాన్స్ టీమ్ ఉండాలని సూచించారు.నేవీ లేదా NSG కమాండోలు లేదా ఇతర బలగాలు సంఘర్షణను దృష్టిలో ఉంచుకుని నిరీక్షించడం ఆలస్యానికి కారణమవుతుందని అన్నారు.

తాజా పరిమాణాలను చూస్తే.. సరిహద్దు అవతలి వైపు నుండి ఎదుర్కొనే  ఉగ్ర బెదిరింపులు మనం మరింత ధైర్యంగా ఎదుర్కొగలమని తాను భావిస్తున్నానని వైస్ అడ్మిరల్ R P సుతాన్  అన్నారు. అన్ని ఏజెన్సీల మధ్య, భద్రతా బలగాలు ,  పౌర సమాజాలు,సంఘాల మధ్య మెరుగైన సమన్వయం అవసరమని అన్నారు. ప్రభావవంతమైన,చర్య తీసుకోగల ఇంటెలిజెన్స్, సమర్థవంతమైన నిఘా వ్యవస్థ ఉంటే.. భవిష్యత్తులో సముద్రం నుండి వచ్చే ఎలాంటి ఉగ్రవాద బెదిరింపులను ఎదుర్కోగలుగుతామని పేర్కొన్నారు.

click me!