సెవెరోడోనెట్స్క్ నివాస ప్రాంతాలను మా ఆధీనంలోకి తీసుకున్నాం - రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు

Published : Jun 08, 2022, 05:04 AM ISTUpdated : Jun 08, 2022, 05:05 AM IST
సెవెరోడోనెట్స్క్ నివాస ప్రాంతాలను మా ఆధీనంలోకి తీసుకున్నాం - రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు

సారాంశం

ఉక్రెయిన్ లోని మరో నగరం రష్యా ఆధీనంలోకి వెళ్లిపోయేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్‌బాస్ ప్రాంతంలోని లుహాన్స్క్ ఒబ్లాస్ట్‌లోని సెవెరోడోనెట్స్క్ సిటీలోని నివాస ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకుంది. దీనిని రష్యా రక్షణ శాఖ మంత్రి స్పష్టం చేశారు. 

తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్‌బాస్ ప్రాంతంలోని లుహాన్స్క్ ఒబ్లాస్ట్‌లోని సెవెరోడోనెట్స్క్ నగరంలోని నివాస ప్రాంతాలను రష్యా మంగళవారం పూర్తి నియంత్రణలోకి తీసుకుంది. ఈ మేర‌కు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ట్విట్ట‌ర్ లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘సెవెరోడోనెట్స్క్ నగరంలోని నివాస ప్రాంతాలు పూర్తిగా విముక్తి పొందాయి.’’ అని ఆయ‌న ట్వీట్ చేశారు. 

424 మంది వీవీఐపీల భద్రతను పున‌రుద్ద‌రించిన పంజాబ్ ప్ర‌భుత్వం.. సింగ‌ర్ సిద్ధూ హత్య నేప‌థ్యంలో నిర్ణ‌యం

సిటీలోని ఇండ‌స్ట్రీయ‌ల్ ఏరియా, సమీప జనావాసాలను స్వాధీనం చేసుకోవడానికి రష్యన్ దళాలు ఇప్పటికీ పోరాడుతున్నాయ‌ని షోయిగు తెలిపారు. అయితే తూర్పు ఉక్రెయిన్ లోని లుగాన్స్క్ ప్రాంతంలో ఇప్పటికీ ఉక్రేనియన్ చేతుల్లో ఉన్న అతిపెద్ద నగరం సెవెరోడోనెట్స్క్ గా ఉంది. అయితే రష్యా ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్ ను ఆక్ర‌మించడం ప్రారంభించింది. అయితే ఆ దేశంలోని కైవ్, ఖార్కివ్ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడంలో రష్యన్ దళాలు విఫలమైంది. దీంతో యుద్ధం ఉక్రెయిన్ తూర్పు ప్రాంతానికి మారింది. రష్యన్ దళాలు తూర్పు ప్రాంతంలో గణనీయమైన విజయాలు సాధించాయి.

ఆదివారం నాడు ఉక్రెయిన్ దళాలు సెవెరోడోనెట్స్క్ లో సగం నియంత్రించాయని ర‌ష్యా పేర్కొంది. ఉక్రేనియన్ దళాలు రష్యన్ దళాలను వెనక్కి నెట్టాయని లుగాన్స్క్ ప్రాంతీయ గవర్నర్ సెర్గీ గైడే చెప్పారు. సెవెరోడోనెట్స్క్లో 70 శాతానికి పైగా రష్యా నియంత్రణలో ఉందని ఉక్రేనియన్ అధికారులు గతంలో చెప్పారు.

త్వ‌ర‌లో రాష్ట్రప‌తి ఎన్నికలు.. 2 రోజుల్లో నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న ఎన్నిక‌ల క‌మిష‌న్

సెవెరోడోనెట్స్క్ లోని రసాయన కర్మాగారంలో సుమారు 800 మంది పౌరులు ఆశ్రయం పొందారని డిమైట్రో ఫిర్తాష్ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ 800 మంది పౌరుల్లో 200 మంది కర్మాగారం ఉద్యోగులు, మిగిలిన 600 మంది సెవెరోడోనెట్స్ నగరానికి చెందిన నివాసితులు ఉన్నారని అమెరికన్ న్యాయవాది తెలిపారు. కాగా ఉక్రెయిన్ లో ముఖ్యమైన రేవు నగరమైన మారిపోల్ ను కూడా  రష్యన్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. గత వారం ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తన దేశంలో 20 శాతం రష్యన్ దళాలు తమ ఆధీనంలో ఉన్నాయని చెప్పారు.

కాగా.. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి నెల‌లో 24వ తేదీన ఉక్రెయిన్, ర‌ష్యాకు యుద్దం మొద‌లైంది. అప్ప‌టి నుంచి రెండు వైపులా ర‌క్త‌పుటేరులు ప్ర‌వ‌హిస్తున్నాయి. ఇరు వైపుల సైనికులు చ‌నిపోతున్నారు. ఈ యుద్ధం వ‌ల్ల కేవ‌లం ఆ రెండు దేశాల‌కే న‌ష్టం జ‌ర‌గ‌డం లేదు. ప్ర‌పంచంలోని ప్ర‌తీ దేశంపై ఈ యుద్ధం ప్ర‌భావం ప్ర‌త్య‌క్షంగానో, ప‌రోక్షంగానో ప‌డుతోంది. ఈ యుద్ధం ఆపేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు అన్నీ విఫ‌లం అయ్యాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు యుద్దం కొన‌సాగుతూనే ఉంది. తాజాగా ఈ వార్ వంద రోజులు కూడా పూర్తి చేసుకుంది. కానీ ఇప్ప‌టికీ రెండు దేశాలు వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. అయితే ఉక్రెయిన్ లోని ఒక్కో న‌గ‌రాన్ని ర‌ష్యా సైన్యం ఆక్ర‌మించుకుంటూ పోతోంది. ఇప్ప‌టికే 20 శాతం ఉక్రెయిన్ భూ భాగం ర‌ష్యా చేతిలోకి వెళ్లిపోయింద‌ని ఆ దేశ అధ్య‌క్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ వారం రోజుల కింద‌ట ప్ర‌క‌టించారు. ఈ యుద్ధం ఇలాగే కొన‌సాగితే మ‌రింత భూభాగం ర‌ష్యా ఆధీనంలోకి వెళ్లిపోయే అవ‌కాశం క‌నిపిస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం