
న్యూఢిల్లీ: Corona కట్టడి సమయంలో హెల్త్ వర్కర్స్ ఎంతో కృషి చేశారని ప్రధానమంత్రి Narendra Modi ప్రశంసించారు. కరోనా సమయంలోనే రైతుల నుండి అత్యధిక స్థాయిలో పంటను కొనుగోలు చేశామని ఆయన గుర్తు చేశారు. కోవిడ్ పై విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మోడీ మండిపడ్డారు.ప్రపంచం ఈ స్థాయి మహమ్మారిని ఏనాడూ చూడలేదన్నారు. కరోనా కష్టకాలంలోనూ కూడా అత్యధిక వృద్దిరేటు సాధించామని మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు రాజ్యసభలో ప్రసంగించారు. సోమవారం నాడు లోక్‌సభలో ఆయన ప్రసంగించిన విషయం తెలిసిందే.
కరోనా సమయంలో ఈ దేశ యువత భారత దేశాన్ని స్టార్టప్ రంగంలో మొదటి మూడు దేశాల ముందుకు తీసకెళ్లిందని మోడీ చెప్పారు.కరోనా మొదటి lock down సమయంలో చర్చల తర్వాత గ్రామాల్లోని రైతులకు లాక్ డౌన్ నుండి మినహాయింపు ఇచ్చామన్నారు. దీని ద్వారా ఉత్పాదకత పెరిగిందన్నారు. ఇది ఒక ముఖ్యమైన పరిణామంగా ఆయన పేర్కొన్నారు.కరోనా సమయంలో దేశంలోని 80 కోట్ల మంది దేశ ప్రజలక ఉచితంగా రేషన్ ఇచ్చామన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో వచ్చే 25 ఏళ్లలో దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై అందరూ దృష్టి పెట్టాలని ప్రధాని మోడీ కోరారు.నల్ సే జల్ పథకంతో గ్రామీణ ప్రాంతంలోని 5 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలకు కూడా తమ ప్రభుత్వం చేరువైందని మోడీ తెలిపారు. కరోనా సమయంలో దేశంలోని 80 కోట్ల మంది పౌరులకు ఉచిత రేషన్ ను పొందేలా చేశామన్నారు. అంతేకాదు రికార్డు స్థాయిలో ఇళ్లకు నీటి కనెక్షన్లను కూడా ఇచ్చామన్నారు.కరోనా సమయంలో భారత్ తీసుకొన్న కార్యక్రమాలను ప్రపంచం అభినందిస్తోందన్నారు.
కరోనా సమయంలో ఇన్‌ఫ్రాస్టక్చర్ రంగంపై తాము కేంద్రీకరించామన్నారు.దేశంలో వంద శాతం వ్యాక్సినేషన్ ను అందించేందుకు తాము కృషి చేస్తున్నామని మోడీ చెప్పారు. ఎంఎస్ఎంఈ, వ్యవసాయరంగం దేశంలో అతి పెద్ద ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందన్నారు.మనం ఏ వైపు ఉన్నా ప్రజల కోసం పనిచేయాలన్నారు. ప్రతిపక్షంలో ఉండడం అంటే సమస్యల పరిష్కారం కోసం మానేయాలనే ఆలోచన సరికాదని ఆయన పరోక్షంగా కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు.
2014-2020 కి ముందు ఉన్న రెండంకెల సంఖ్యలతో పోల్చితే ప్రపంచంలోనే అధిక వృద్ది సాధించామని మోడీ తెలిపారు. కరోనాను అరికట్టేందుకు ముఖ్యమంత్రులతో 23 దఫాలు సమావేశాలు నిర్వహించినట్టుగా మోడీ చెప్పారు.
కరోనా సమయంలో అన్ని ప్రతికూల సామాజిక వర్గాల కోసం కేంద్రం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ద్రవ్యోల్బణం యావత్తు ప్రపంచాన్ని ప్రభావితం చేసిందన్నారు. 40 ఏళ్లలో ఏనాడు ఎదుర్కోని ద్రవ్యోల్బణాన్ని అమెరికా ఎదుర్కొంటుందని ప్రధాని చెప్పారు.ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించామన్నారు.కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ద్రవ్యోల్బణం రెండంకెల్లో ఉండేదన్నారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ద్రవ్యోల్బణం 4 నుండి 5 శాతం మధ్యే ఉందన్నారు. వ్యవసాయ రంగంలో రైతులకు న్యాయం చేసేందుకు గాను ప్రభుత్వం రైతులకు మద్దతు ధరను అందించిందన్నారు.