ఏసీ రూముల్లో కూర్చొని ఫత్వాలు జారీ చేసే వాళ్లం కాదు.. 24 గంటలూ ప్రజల్లోకి వెళ్లి పని చేస్తాం - ప్రధాని మోడీ

Published : Jun 27, 2023, 03:27 PM IST
ఏసీ రూముల్లో కూర్చొని ఫత్వాలు జారీ చేసే వాళ్లం కాదు.. 24 గంటలూ ప్రజల్లోకి వెళ్లి పని చేస్తాం - ప్రధాని మోడీ

సారాంశం

తాము 24 గంటలూ ప్రజల్లోకి వెళ్లి పని చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఏసీ రూముల్లో కూర్చొని ఫత్వాలు జారీ చేసే ప్రభుత్వం తమది కాదని అన్నారు. మధ్యప్రదేశ్ లో 10 లక్షల మంది బీజేపీ కార్యకర్తలతో ప్రధాని వర్చువల్ గా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఏసీ రూముల్లో కూర్చొని పని చేసే ప్రభుత్వం తమది కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 24 గంటలూ ప్రజల్లోకి వెళ్లి పనిచేస్తామని చెప్పారు. ఈ ఏడాది చివరిలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి చెందిన 10 లక్షల మంది కార్యకర్తలతో ప్రధాని మోడీ మంగళవారం వర్చువల్ గా మాట్లాడారు. బీజేపీకి బూత్ కార్యకర్తలే అతి పెద్ద శక్తి అని, వారు పార్టీని దేశంలోనే అతిపెద్దదిగా మార్చడానికి, క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువయ్యేలా చూసుకుంటారని అన్నారు.

మున్సిపల్ కమిషనర్ కుక్క అదృశ్యం.. వెతికిపట్టుకునేందుకు పోలీసుల తిప్పలు.. 36 గంటల్లో 500 ఇళ్లలో సోదాలు

‘‘బీజేపీకి కార్యకర్తలే అతి పెద్ద శక్తి. పార్టీని దేశంలోనే అతి పెద్ద పార్టీగా తీర్చిదిద్దారు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నేను జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దీని వల్ల నేను వర్చువల్ గా బీజేపీకి చెందిన 10 లక్షల మంది బూత్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించగలుగుతున్నాను. ఇలాంటి వర్చువల్ కార్యక్రమం ఏ రాజకీయ పార్టీ చరిత్రలో జరగలేదు’’ అని అన్నారు. 

బీజేపీని ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా మార్చడంలో మధ్యప్రదేశ్ గణనీయమైన పాత్ర పోషించిందని ప్రధాని మోడీ అన్నారు. ‘‘మేం ఎయిర్ కండిషన్డ్ గదుల్లో కూర్చొని ఫత్వాలు జారీ చేసే వాళ్లం కాదు. ప్రజల్లోకి వెళ్లి 24 గంటలూ దృఢ సంకల్పంతో ఉంటాం’’ అని అన్నారు. కాగా.. అంతకు ముందు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి ఐదు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఆధునిక కనెక్టివిటీ పొందిన జార్ఖండ్, గోవా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, కర్ణాటక ప్రజలకు అభినందనలు తెలిపారు.

‘‘ఈ రోజు రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను పొందినందుకు మధ్యప్రదేశ్ ప్రజలను నేను అభినందిస్తున్నాను. దీని వల్ల భోపాల్ నుంచి జబల్ పూర్ కు ప్రయాణం మరింత వేగంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. వందే భారత్ రైలు రాష్ట్రంలో కనెక్టివిటీని పెంచుతుంది’’ అని ప్రధాని మోడీ అన్నారు. జెండా ఊపి ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలులో ప్రయాణిస్తున్న సిబ్బంది, కొందరు పిల్లలతో ముచ్చటించారు.

పాకిస్థాన్ లో సిక్కులపై దాడులు.. ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు

ప్రధాని జెండా ఊపి ప్రారంభించిన ఐదు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో రాణి కమలాపతి-జబల్పూర్, ఖజురహో-భోపాల్-ఇండోర్, మడ్గావ్ (గోవా)-ముంబై, ధార్వాడ్-బెంగళూరు, హతియా-పాట్నా హైస్పీడ్ రైళ్లు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గవర్నర్ మంగుభాయ్ పటేల్, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైషా, జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్