
అస్సాం డెప్యుటీ స్పీకర్ కృపనాథ్ మల్లాహ్ కి చేదు అనుభవం ఎదురైంది. ఎంతో ఆనందంగా ఏనుగు అంబారి ఎక్కిన ఆయనకు ఊహించని షాక్ తగిలింది. ఏనుగు మీద నుంచి జారి కిందపడిపోయారు. ఆయన మద్దతు దారులు నిర్వహించిన ఊరేగింపులో భాగంగా ఏనుగు మీద కూర్చున్న ఆయన.. దారి మధ్యలో ఏనుగు మీద నుంచి కిందకి జారి పోయారు.
కృపనాథ్ మల్లాహ్.. కరీంగంజ్ జిల్లాలోని రాతాబరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం డెప్యుటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. శనివారంనాడు డెప్యుటీ స్పీకర్ హోదాలో తన సొంత నియోజకవర్గానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మద్దతు దారులు ఏనుగు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఏనుగుపైకి ఎక్కిన కృపనాథ్ కాసేపటికే జారి కింద పడ్డారు. కాగా ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. కాగా.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.