మంత్రి హత్యకు కుట్ర.. బాంబులతో దాడి

Published : Feb 18, 2021, 08:13 AM IST
మంత్రి హత్యకు కుట్ర..  బాంబులతో దాడి

సారాంశం

ఈ దాడిలో గాయపడిన మంత్రి జాకీర్ హుసేన్ ను జంగిపూర్ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో గాయపడిన మంత్రి జాకీర్ హుసేన్ ను జంగిపూర్ ఆసుపత్రికి తరలించారు.

పశ్చిమబెంగాల్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జాకీర్ హుసేన్  హత్యకు కుట్ర జరిగింది. జాకీర్ హేసేన్ పై గుర్తుతెలియని వ్యక్తులు క్రూడ్ బాంబులతో దాడి చేశారు. ముర్షిదాబాద్ జిల్లాలోని రఘునాథగంజ్ నుంచి నింటిటా రైల్వే స్టేషన్ నుంచి కోల్ కతా వెళ్లేందుకు రైలు ఎక్కడం కోసం కారులో వస్తున్న మంత్రి జాకీర్ హుసేన్ పై ఆగంతకులు క్రూడ్ బాంబులతో దాడి చేశారు.

ఈ దాడిలో గాయపడిన మంత్రి జాకీర్ హుసేన్ ను జంగిపూర్ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో గాయపడిన మంత్రి జాకీర్ హుసేన్ ను జంగిపూర్ ఆసుపత్రికి తరలించారు. జంగిపూర్ ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం మంత్రిని కోల్ కతాకు తరలించారు.ఈ దాడిలో మంత్రితోపాటు ఇతరులు కూడా గాయపడ్డారు. మంత్రిపై జరిగిన బాంబు దాడిని కేంద్రమంత్రి పీయూష్ గోయల్, పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధంఖర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియలు ఖండించారు. గాయపడిన మంత్రి జాకీర్ త్వరగా కోలుకోవాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని గవర్నర్ జగదీప్ ధంఖర్ వ్యాఖ్యానించారు.
 

PREV
click me!

Recommended Stories

Aadhaar Card New Rules : 2026లో ఆధార్ అప్‌డేట్ చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి !
Jobs : కేవలం జనవరి ఒక్క నెలలోనే.. లక్ష ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్దం