
PM Narendra Modi: సరిహద్దులో గతకొంత కాలంగా చైనా, పాకిస్థాన్ లు నడుచుకుంటున్న తీరును గురించి ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ శాంతి పక్షాన నిలబడుతుందనీ, ఏవైనా సమస్యలు-వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు. సరిహద్దుల్లో శాంతి నెలకొంటే తప్ప చైనాతో సత్సంబంధాలు సాధ్యం కాదన్నారు. "వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. యుద్ధం దేనికీ పరిష్కారం కాదు. పరస్పర గౌరవాన్ని భారత్ విశ్వసిస్తుందని" మోడీ అన్నారు.
వివరాల్లోకెళ్తే.. అమెరికా పర్యటనకు ముందు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అంతర్జాతీయంగా భారత్ కు దక్కాల్సిన గుర్తింపు లభిస్తోందన్నారు. "ఈ కాలంలో, మనం మరింత అనుసంధానం కావడం ద్వారా, ఇతర దేశాలతో సంబంధాలు కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాము. సరిహద్దుల్లో శాంతి నెలకొంటే తప్ప చైనాతో సత్సంబంధాలు సాధ్యం కాదు. వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. యుద్ధం దేనికీ పరిష్కారం కాదు. పరస్పర గౌరవాన్ని భారత్ విశ్వసిస్తుంది" అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
"కొన్ని దేశాలు తాము శాంతి పక్షం వహించడం లేదని చెప్పుకుంటున్నాయి. కానీ భారత్ మాత్రం శాంతి వైపు ఉంది. భారతదేశం శాంతికి ప్రాముఖ్యత ఇస్తుందని ప్రపంచానికి తెలుసు. సంఘర్షణను నివారించడానికి భారతదేశం అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందని" ప్రధాన మంత్రి చెప్పారు. కాగా, 14 ఏళ్ల విరామం తర్వాత భారత ప్రధానికి అమెరికాలో అధికారిక ఆహ్వానం మేరకు పర్యటించే అవకాశం లభించింది. అంతకుముందు 2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ను అధికారిక పర్యటనకు ఆహ్వానించారు.
ప్రధాని నరేంద్ర మోడీకి జో బైడెన్ ఆహ్వానం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య సన్నిహిత సంబంధాలకు నిదర్శనంగా భావిస్తున్నారు. అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశాల్లో ఈ పర్యటన ఒకటి. దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకే ఇది జరుగుతుంది. భారత్ కు అనుమతించిన అమెరికా పర్యటన ప్రపంచవ్యాప్తంగా ఆ దేశ ప్రతిష్ఠకు ప్రతిబింబంగా భావిస్తారు. ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలకు ఈ పర్యటన ఎంతో కీలకం కానుంది.