
ప్రస్తుతం యువత పబ్జీ గేమ్ లకు, టిక్ టాక్ లకు బాగా అలవాటు పడిపోయారు. చదువు, ఉద్యోగం, తిండి, నిద్రలను పక్కనపెట్టి మరీ... పబ్జీ గేమ్ లు ఆడుతున్నారు. ఓ యువకుడు అయితే... ఏకంగా తన పెళ్లిలో కూడా వధువును పక్కన పెట్టుకొని.. ఆమెను పట్టించుకోకుండా పబ్జీ గేమ్ ఆడాడు. అక్కడితో ఆగలేదు. పెళ్లికి వచ్చిన అతిథులు ఇచ్చే గిఫ్ట్‌ల్ని విసిరికొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ పెళ్లిలో వరుడు పబ్‌జీ ఆడుతున్నాడు. పక్కనే వధువు ఉన్నా పట్టించుకోకుండా గేమ్‌లో నిమగ్నమయ్యాడు. పెళ్లికి వచ్చిను ఓ అతిథి గిఫ్ట్ తెచ్చి ఇచ్చాడు.. ఆ గిఫ్ట్‌ను కూడా పక్కకు విసిరేశాడు. అబ్బాయిగారి వ్యవహారం పెళ్లికి వచ్చినవారితోపాటు... వధువుని కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. . టిక్‌టాక్‌లో ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియో ఎక్కడ తీశారు.. పెళ్లి ఎక్కడ జరిగిందన్నది క్లారిటీ లేదు. టిక్ టాక్ కోసమే ఈ వీడియో తీశారా.. నిజంగానే వరుడు పబ్‌జీ ఆడాడా అన్నది తెలియలేదు. నెటిజన్లు మాత్రం ఈ వరుడిపై సెటైర్లు పేలుస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో... సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.