మా ఆస్తి నా భర్త బిడ్డకు పోతుందని భయంతో హత్యచేశా: రోహిత్ హత్యపై భార్య అపూర్వ శుక్లా

By Nagaraju penumalaFirst Published May 2, 2019, 8:40 AM IST
Highlights

మరోవైపు ఆస్తిలో తన బిడ్డకు వాటా ఇవ్వాలని ఆ బిడ్డ తల్లి రోహిత్ ను డిమాండ్ చేస్తోందని తెలియడంతో తీవ్రంగా మానసిక ఒత్తిడికి గరయ్యానని దాంతో భర్తను హత్య చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే భర్త రోహిత్ తివారీ హత్యకు ప్లాన్ వేసినట్లు పోలీస్ విచారణలో తేలింది. 

ఢిల్లీ: మాజీ గవర్నర్ ఎన్డీ తివారి తనయుడు రోహిత్ తివారీ హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. ఆస్తికోసం రోహిత్ తివారీ ను అతని భార్య అపూర్వ శుక్లాయే హత్య చేసినట్లు నిర్ధారించారు. అయితే పోలీసుల విచారణలో అపూర్వశుక్లా భర్త రోహిత్ తివారీపై కీలక వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

రోహిత్ తివారీ తనకు వరసకు మరదలు అయ్యే ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఫలితంగా ఆ మహిళ ఒక బిడ్డకు తల్లికూడా అయ్యిందని తెలిసిందన్నారు. మరదలితో అక్రమ సంబంధం పెట్టుకుని కట్టుకున్న భార్య అయిన అపూర్వ శుక్లాపై కృరత్వంగా ప్రవర్తించేవాడని విచారణలో అపూర్వ స్పష్టం చేసింది. 

తనను ప్రేమించుకుండా మరదలిని ప్రేమించేవాడని ఆమె వాపోయింది. అంతేకాకుండా మరదలికి బిడ్డ పుట్టడంతో తమ ఆస్తి ఆ బిడ్డకు దక్కుతుందన్న ఆందోళనతో రోహిత్ తివారీ ను హత్య చెయ్యాల్సి వచ్చిందని  పోలీసుల విచారణలో అపూర్వ వెల్లడించారు. 

రోహిత్ తివారీ అక్రమ సంబంధం విషయంలో తమ మధ్య తరచూ వివాదాలు జరిగేవని ఆమె స్ఫష్టం చేశారు. మధ్యప్రదేశ్‌ కు చెందిన అపూర్వశుక్లా లా చదివారు. ఇండోరో తోపాటు సుప్రీంకోర్టులోనూ ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకున్న శుక్లా రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. 

అందులో భాగంగా ఓ వివాహ రిజిస్ట్రేషన్ వెబ్ సైట్ లో రోహిత్ తివారీ వివరాలు చూసిన ఆమె అతనిని పెళ్లి చేసుకుంటే తన లక్ష్యం నెరవేరుతుందని భావించింది. ఈ నేపథ్యంలో అతనిని పెళ్లాడింది. అయితే అపూర్వ ఊహించినదానికి రివర్స్ అయ్యింది. 

భర్త రోహిత్ తివారీ తనతో కాకుండా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోపాటు వారికి ఒక బిడ్డ కూడా ఉండటంతో ఆమె ఆందోళన చెందింది. భర్త రోహిత్ తివారీకి విడాకుల నోనటీసులు సైతం పంపించింది. 

అయితే ఆకస్మాత్తుగా రోహిత్ హృద్రోగ సమస్యతో ఆస్పత్రిలో చేరిన తర్వాత మళ్లీ కలిసుండాలనే ప్రతిపాదనకు వచ్చారు. కానీ రోహిత్ తల్లి వ్యవహారశైలితో పరిస్థితిలో మార్పు రాలేదని అపూర్వ శుక్లా పోలీసుల విచారణలో స్పష్టం చేసింది. 

రోహిత్ తివారీ తల్లి అనుమతి లేకుండా కనీసం బెడ్ రూమ్ కర్టిన్ కూడా మార్చే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని వాపోయింది. మరోవైపు ఆస్తిలో తన బిడ్డకు వాటా ఇవ్వాలని ఆ బిడ్డ తల్లి రోహిత్ ను డిమాండ్ చేస్తోందని తెలియడంతో తీవ్రంగా మానసిక ఒత్తిడికి గరయ్యానని దాంతో భర్తను హత్య చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే భర్త రోహిత్ తివారీ హత్యకు ప్లాన్ వేసినట్లు పోలీస్ విచారణలో తేలింది. 

click me!