మహారాష్ట్ర గిర్డర్ ప్రమాదం.. 17కు చేరిన మృతుల సంఖ్య..

Published : Aug 01, 2023, 09:32 AM IST
మహారాష్ట్ర గిర్డర్ ప్రమాదం.. 17కు చేరిన మృతుల సంఖ్య..

సారాంశం

థానేలోని షాపూర్ సమీపంలో గిర్డర్ లాంచింగ్ మెషిన్ కుప్పకూలడంతో 17 మంది మరణించారు. సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే ఫేజ్ III నిర్మాణంలో ఈ యంత్రాన్ని ఉపయోగించారు.

మహారాష్ట్ర : మహారాష్ట్రలోని థానేలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 17కు చేరుకుంది. సమృద్ధి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణ పనుల్లో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 17 కు చేరింది. మంగళవారం తెల్లవారుజామున గిర్డర్ లాంచర్ యంత్రం కూలింది. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోగా ముగ్గురికి గాయాలయ్యాయి,  

ప్రస్తుతం మృతుల సంఖ్య 17 కు చేరుకుంది. పోలీసులు, అగ్నిమాపక, ఎన్టీఆర్ ఆఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమృద్ధి ఎక్స్ప్రెస్ హైవే ఫేస్ 3 నిర్మాణంలో ఉపయోగించిన గిర్డర్ లాంచర్ యంత్రం థానేలో కుప్పకూలింది. దీంతో  ఈ మరణాలు సంభవించాయి. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంకా చాలామంది శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది.  

థానేలో ఘోర ప్రమాదం.. గిర్డర్ లాంచర్ కూలి 15 మంది మృతి, మరో ముగ్గురికి గాయాలు

గిర్డర్ లాంచర్ కలిపే క్రేన్ స్లాబ్ 100 అడుగుల ఎత్తు నుంచి పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సమాచారం. ఈ ప్రమాద ఘటనలో గాయపడి వారిని, మృతిచెందిన వారి మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన  వ్యక్తం చేస్తున్నారు. 

బాలాసాహెబ్ ఠాక్రే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్ అని పిలిచే ఈ సమృద్ధి మహామార్గ్ 71 కిలోమీటర్లు ఉంటుంది. ముంబై నాగపూర్ లను ఈ మహా మార్గ్ కలుపుతుంది. ఈ యంత్రాన్ని హైవే, హై స్పీడ్ రైల్ బ్రిడ్జి నిర్మాణ ప్రాజెక్టుల్లో ప్రికాస్ట్ బాక్స్ గిడ్డర్లను ఏర్పాటు చేయడానికి ఉపయోగిస్తారు. 

PREV
click me!

Recommended Stories

మరో వీడియో రిలీజ్ చేసిన మోదీ ఏమన్నారంటే? | PM Narendra Modi Releases Another Video on Exam Reforms
ప‌రీక్ష‌ల వ్య‌వ‌స్థ‌లో కేంద్రం భారీ సంస్క‌ర‌ణ‌లు.. హైప‌వ‌ర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు