రోడ్డు మీద వెళ్లాల్సిన స్కూటర్.. అక్కడికి ఎలా ఎక్కిందబ్బా..వైరల్ వీడియో

Published : Jun 22, 2023, 11:25 AM IST
రోడ్డు మీద వెళ్లాల్సిన స్కూటర్.. అక్కడికి ఎలా ఎక్కిందబ్బా..వైరల్ వీడియో

సారాంశం

స్కూటర్ ఎలా ల్యాండ్ అయిందనే విషయం అర్థంకాక నెటిజన్లు జుట్టు పీక్కుంటుున్నారు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో నెటిజన్లను అయోమయానికి గురి చేసేస్తోంది.

ఈరోజుల్లో ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. తాజాగా ఓ స్కూటీ వీడియో నెట్టింట నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆకట్టుకోవడమే కాదు,  అసలు ఆ స్కూటర్ అక్కడికి ఎలా వెళ్లిందబ్బా అనే సందేహం అందరికీ కలగడం గమనార్హం.

 ఒక దుకాణానికి ఆనుకుని చిక్కుకున్న హై-టెన్షన్ వైర్ల లో స్కూటర్ ఇరుక్కుపోయి కనిపించడం విశేషం.  స్కూటర్ ఎలా ల్యాండ్ అయిందనే విషయం అర్థంకాక నెటిజన్లు జుట్టు పీక్కుంటుున్నారు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో నెటిజన్లను అయోమయానికి గురి చేసేస్తోంది. నివేదికల ప్రకారం, వీడియో జమ్మూకి చెందినది. జూన్ 18న గాలివాన కారణంగా ఇది వైర్లలో ఇరుక్కుపోయిందని తెలుస్తోంది. ఇది అసాధ్యమని అనిపించినప్పటికీ, వైరల్ వీడియో  మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది.

 

ఈ వీడియోకి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎక్కువగా ఫన్నీ కామెంట్స్ వస్తుండటం విశేషం.  “బహుశా ఎలక్ట్రిక్ స్కూటర్.....డైరెక్ట్ ఛార్జింగ్” అని ఒక వినియోగదారు సరదాగా సూచించారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్