నిన్న అంటూ జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్న సంగతి తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ యోగాసనాలు వేశారు. ఇక చాలా మంది యోగాసనాలు వేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా, భూమి మీద కాదు ఏకంగా అంతరిక్షంలో కూడా యోగసాలు వేశారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నివసిస్తూ పని చేస్తున్న వ్యోమగామి సుల్తాన్ అల్ నెయాది అంతరిక్షంలో యోగా ఆసనం వేస్తున్న చిత్రంతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. అతను ISSలో యోగా సాధన చేస్తున్న చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. కాగా, ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
“ఈరోజు #అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఇక్కడ నేను ISSలో కొంచెం యోగా సాధన చేస్తున్నాను. ఎంతో ఇష్టమైన పని.#యోగ శరీరాన్ని బలపరచడమే కాకుండా మనస్సును పదునుపెట్టి ఒత్తిడిని తగ్గిస్తుంది. మీకు ఇష్టమైన యోగా భంగిమ ఏది?" అతను క్యాప్షన్ పెట్టాడు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏటా జూన్ 21న జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని 2014లో తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. 2015లో UN జనరల్ అసెంబ్లీ అధికారికంగా ఆమోదించింది.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2014లో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా యోగాకు పెరుగుతున్న ప్రజాదరణ, ప్రతిచోటా ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగుపరిచే దాని సామర్థ్యాన్ని ఇది గుర్తించింది.