వైరల్ ఫొటో : డీఎస్పీ కొడుకు, ఎస్సై తల్లి... సెల్యూట్ చేస్తున్న ఆమె కళ్లలో ఆనందానికి నెటిజన్లు ఫిదా...

Published : Aug 21, 2021, 08:17 AM IST
వైరల్ ఫొటో : డీఎస్పీ కొడుకు, ఎస్సై తల్లి... సెల్యూట్ చేస్తున్న ఆమె కళ్లలో ఆనందానికి నెటిజన్లు ఫిదా...

సారాంశం

ఈ మధ్య కాలంలో ఉద్యోగరీత్యా కొడుకును తండ్రి గౌరవించడం, ఉన్నతాధికారి అయిన కుమార్తెకు తండ్రి సెల్యూట్ చేయడం వంటి సన్నివేశాలను మనం చూశాం. అయితే ఇప్పుడు మనం చూడబోయే ఓ చిత్రంలో కన్నతల్లి, ఉన్నతాధికారి అయిన కొడుకుకు సెల్యూట్ చేస్తూ మురిసిపోతుంటుంది. 

గాంధీనగర్ : పిల్లలు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తే.. సహజంగానే తల్లిదండ్రుల ఆనందానికి అవధులుండవు. అయితే, పిల్లలను తాము గౌరవించాల్సిన ఉన్నత స్థితికి వారు చేరుకుంటే తల్లిదండ్రులకు పట్టపగ్గాలు ఉండవని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 

ఇలా ఈ మధ్య కాలంలో ఉద్యోగరీత్యా కొడుకును తండ్రి గౌరవించడం, ఉన్నతాధికారి అయిన కుమార్తెకు తండ్రి సెల్యూట్ చేయడం వంటి సన్నివేశాలను మనం చూశాం. అయితే ఇప్పుడు మనం చూడబోయే ఓ చిత్రంలో కన్నతల్లి, ఉన్నతాధికారి అయిన కొడుకుకు సెల్యూట్ చేస్తూ మురిసిపోతుంటుంది. 

వివరాల్లోకి వెడితే.. గుజరాత్ లోకి అరవల్లి ప్రాంత డీఎస్పీకి (పోలీస్ శాఖ), స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ మహిళా ఏఎస్సై సెల్యూట్ చేస్తుంది. ఇందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా? అక్కడ పరస్పరం సెల్యూట్ చేసుకున్న వారు తల్లి కొడుకు కావడమే విశేషం. ఈ సందర్భంగా తల్లి మురిసిపోతూ, కళ్లనిండా ఆనందంతో కొడుకుకు సెల్యూట్ చేస్తున్న దృశ్యం హైలెట్ గా నిలిచింది. 

ఈ అపురూప దృశ్యాన్ని గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమీషనర్ చైర్మన్ దినేష్ దాస ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనస్సుకు హత్తుకునే ఈ ఫొటోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అమ్మ కళ్లలో అసలు సిసలైన ఆనందాన్ని చూడాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

ఢిల్లీ లిక్కర్ కేసులో ఊహించ‌ని ట్విస్ట్.. కంటతడి పెట్టుకున్న కేజ్రీవాల్, కవిత స్పందన ఏంటంటే.?
PM Modi: 10 కోట్లు దాటిన మోదీ ఇన్‌స్టా ఫాలోవ‌ర్లు.. ప్ర‌ధానికి సోష‌ల్ మీడియా ద్వారా డ‌బ్బులొస్తాయా.?