Kerala Labourer Model: నిన్నటివ‌ర‌కు ఓ రోజువారి కూలీ.. నేడు అత‌నో మోడల్..

By Rajesh K  |  First Published Feb 15, 2022, 7:10 PM IST

Kerala Labourer Model:అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. నిన్నటి వరకు రోజువారీ అవసరాలకు కూడా ఇబ్బంది పడిన ఓ కూలీ. రాత్రికి రాత్రే.. ఓవ‌ర్ నైట్ సెలబ్రిటీ అయ్యాడు. మోడ‌ల్ గా మారి.. ప‌లు బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారాడు. నిన్న‌టి దాక రోజు కాయకష్టం చేసుకుంటేనే గానీ ఇల్లు గడవని ఓ రోజువారి కూలీ ప్రొఫెషనల్ మోడల్స్‌ను తలదన్నేలా..మోడల్ గా మారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు.
 


Kerala Labourer Model: అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. నిన్నటి వరకు రోజువారీ అవసరాలకు కూడా ఇబ్బంది పడిన ఓ కూలీ. రాత్రికి రాత్రే.. ఓవ‌ర్ నైట్ సెలబ్రిటీ అయ్యాడు. మోడ‌ల్ గా మారి.. ప‌లు బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారాడు. నిన్న‌టి దాక రోజు కాయకష్టం చేసుకుంటేనే గానీ ఇల్లు గడవని ఓ రోజువారి కూలీ ప్రొఫెషనల్ మోడల్స్‌ను తలదన్నేలా..మోడల్ గా మారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు. ఓ రోజువారి కూలీ ఏంటీ ?  మోడ‌ల్ గా మార‌డ‌మేంటీ అని అనుకుంటున్నారా..? ఇది న‌మ్మ‌శ‌క్యం కాకున్న.. న‌మ్మాల్సిన వాస్త‌వం. దీని వెనుకున్న కథకమామీషు ఏంటో.. తెలుసుకుందాం..

వివ‌రాల్లోకేళ్తే.. కూలీ నుంచి మోడ‌ల్ గా మారిన వ్య‌క్తి పేరు మమ్మికా (Mammikka). అత‌డి వ‌య‌స్సు 60 ఏళ్లు. కేర‌ళ‌లోని కొజికోడ్ జిల్లాలో కూలీ ప‌ని చేస్తూ జీవ‌నాన్ని సాగిస్తున్నాడు. అయితే.. త‌న జీవితంలోకి ఓ ఫొటోగ్రాఫర్ ఎంటర్ అయ్యి.. త‌న జీవితాన్నే మార్చివేశాడు. ఆ ఫొటోగ్రాఫరే షరీక్ వయలిల్ (Shareek Vayalil). కొన్ని రోజుల క్రితం.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మమ్మికాను చూశాడు. అత‌డు లూంగీ, చినికిన‌ చోక్కా వేసుకున్న‌.. అత‌నిలో ఓ మోడల్‌ని చూశాడు. త‌నతో ఓ  ప్రమోషనల్ ఫొటోషూట్ చేయాల‌ని భావించాడు. అనుకున్నదే తడువుగా.. మ‌మ్మికా ను క‌లిశాడు. ఆ సమ‌యంలో .. నేనేంటీ?  నాతో ఫోటో షూట్ ఏంటి ?  నేనోక రోజు వారి కూలీని .. నాతో జోక్‌లు వేయ‌కండని అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. త‌రువాత మ‌రుస‌టి రోజు అత‌న్ని ఇంటికి వెళ్లి.. తాను చాలా సీరియ‌స్ గా అంటున్నా.. నీతో ఓ ఫోటో షూట్ చేయాల‌ని అనుకుంటున‌ని ఒప్పించాడు.
 
ఆ తర్వాత రోజు.. మమ్మికా ను ఓ ప్రొఫెష‌న‌ల్ సెలూన్ కి తీసుకెళ్లి... త‌నకు మేక్ ఓవ‌ర్ చేయించాడు. మమ్మిక ను త‌న‌ను తాను గుర్తు పట్టలేనట్లుగా మార్చేశాడు. తన‌తో సూటూ బూటూ వేచించాడు.  చేతికి ఓ ఐపాడ్ ఇచ్చి స్టైల్ గా పోజ్ కొట్టించారు. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ shk_digitalలో పోస్ట్ చేశారు షరీక్. అంతే అవి వైరల్ అయ్యాయి. 

Latest Videos

undefined

మమ్మికా అచ్చుగుద్దిన‌ట్టు నటుడు విజయకాన్ లా క‌నిపిస్తున్నాడ‌నీ నెటిజన్లు కామెంట్స్ చేశారు. మమ్మికాను మార్చిన ఫోటోగ్రాఫర్‌ను మెచ్చుకున్నారు. మట్టిలో మణిక్యాన్ని వెలికితీశాడ‌ని నెటిజ‌న్లు ప్ర‌శంసించారు. మమ్మిక కి మేకప్ ఆర్టిస్ మజ్నాస్ మేకప్ వేశారు.  మేకప్ అసిస్టెంట్లుగా మజ్నాస్ కి ఆషిక్ ఫ్వాద్, షబీబ్ వయాలిల్ పనిచేశారు. మమ్మికాకి సంబంధించిన స్టిల్స్, వీడియో క్లిప్ లను షరీక్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.

ఇప్పుడు మమ్మికా కు ఓ  సొంత ఇన్‌స్టాగ్రామ్ పేజీ తెరిచి.. అందులో ఆయన తన ఫొటోలు, స్టిల్స్ పోస్ట్ చేస్తున్నాడు. దీంతో మమ్మికాకి క్రేజ్ పెరిగింది. అత‌నిపై  మీడియాలో చాలా మంది కథనాలు ఇస్తున్నారు. సాధారణ కూలీ నుంచి మోడల్‌గా మారానని సంతోషంగా చెబుతున్నాడు. తనను చుట్టుపక్కల వారు కూడా గుర్తు పట్టడం లేదని..ఈ గొప్పతనం అంతా ఫోటో గ్రాఫర్ షరీక్ వయాలీల్ దేనంటున్నాడు. మోడల్ గా మారినా... తన రోజువారీ కూలీ పని చేసుకుంటూనే ఉంటానని తెలిపాడు. ఎవరైనా మోడలింగ్ ఆఫర్లు ఇస్తే వాటిని ఒప్పుకుంటానని చెబుతున్నాడు. కోజికోడ్... కొడివల్లీలోని తన సొంతూరు వెన్నక్కడ్ లో మమ్మికా ఇప్పుడు హీరో అయిపోయాడు.

 

 

click me!