మణిపూర్ లోని ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని పాట్సోయో పోలీసు స్టేషన్ పరిధిలోని రెండు ఇళ్లకు దుండుగులు నిప్పు అంటించారు. బుల్లెట్లతో మోత మోగించారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
మణిపూర్ లో మళ్లీ హింస చెలరేగింది. ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో రెండు ఇళ్లకు దుండగులు నిప్పంటించారు. పలు రౌండ్లు కాల్పులు జరిగాయి. పాట్సోయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ కీతెల్మన్బీలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఇళ్ల దహనమవడం, కాల్పుల మోత మోగడంతో ఆ ప్రాంతలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సిక్కింలో ఆకస్మిక వరదలు.. 14 మంది మృతి, 102 మంది గల్లంతు..
దీనిపై సమాచారం అందగానే భద్రతా బలగాలు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతంలో గుమిగూడిన మెయిటీ మహిళల గుంపును భద్రతా దళాలు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అదనపు భద్రతను ఏర్పాటు చేశారు.
వందే భారత్ రైళ్లకు ఆరెంజ్ కలర్.. దీని వెనక రాజకీయ కారణముందా ? కేంద్ర రైల్వే మంత్రి ఏం చెప్పారంటే ?
షెడ్యూల్డ్ తెగ హోదా కోసం మెయితీ కమ్యూనిటీ డిమాండ్ కు నిరసనగా మే 3 న కొండ జిల్లాల్లో 'ట్రైబల్ సాలిడారిటీ మార్చ్' నిర్వహించిన తరువాత మణిపూర్ లో జాతి ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి చెలరేగిన హింసలో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. కాగా.. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మెయిటీలు ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. గిరిజనులైన నాగాలు, కుకిలు - 40 శాతానికి పైగా ఉన్నారు. వీరు కొండ జిల్లాల్లో నివసిస్తున్నారు.