వైద్యులపై దాడి చేస్తే భారీగా జరిమానా, జైలు శిక్ష: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

By narsimha lodeFirst Published Apr 22, 2020, 3:35 PM IST
Highlights

డాక్టర్లపై దాడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. డాక్టర్లపై దాడి చేస్తే రూ.1లక్ష నుండి రూ.5లక్షల వరకు జరిమానాను విధించాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. 
 

న్యూఢిల్లీ: డాక్టర్లపై దాడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. డాక్టర్లపై దాడి చేస్తే రూ.1లక్ష నుండి రూ.5 లక్షల వరకు జరిమానాను విధించాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. 

బుధవారం నాడు కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు వివరించారు.

also read:ఆజాద్‌పూర్‌లో పండ్ల వ్యాపారి కరోనాతో మృతి: మార్కెట్ మూసివేయాలని డిమాండ్

వైద్యులపై దాడులు చేసిన వారికి ఆరు నెలల నుండి ఏడేళ్ల సంవత్సరాల జైలు శిక్ష విధించనున్నట్టుగా ఆయన చెప్పారు. వైద్య సిబ్బందిపై దాడి చేస్తే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్లు జారీ చేయనున్నామని కేంద్రం తెలిపింది. క్లినిక్ లపై దాడి చేస్తే మార్కెట్ విలువ కంటే రెండింతలు ఎక్కువ జరిమానాను వసూలు చేస్తామన్నారు. 

కరోనా విధుల్లో ఉన్న వారికి రూ. 50 లక్షల ఉచిత భీమాను అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకొంది. వైద్య సిబ్బంది రక్షణ కోసం త్వరలోనే ఆర్డినెన్స్ తీసుకురానున్నట్టుగా మంత్రి జవదేవకర్ ప్రకటించారు.ఆరోగ్య కార్యకర్తలపై దాడులు అమానుషమన్నారు. 

డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడుల ఘటనను 30 రోజుల్లో విచారణ పూర్తి చేయనున్నట్టు తెలిపారు. కరోనా కాలంలోనే కాదు సాధారణ రోజుల్లో కూడ ఇదే చట్టం అమల్లో ఉంటుందన్నారు.1897 చట్టానికి అనుగుణంగా వైద్యుల రక్షణ కోసం ఆర్డినెన్స్ తీసుకురానున్నట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు.

విమానాల రాకపోకలు తిరిగి ఎప్పటి నుండి ప్రారంభించాలనే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. విమాన రాకపోకలు ఎప్పుడు ప్రారంభిస్తారనే విసయమై సకాలంలో ప్రకటన చేస్తామని మంత్రి ప్రకటించారు.


 

click me!