కరోనా రూల్స్ బ్రేక్ చేసినందుకు.. ఐదేళ్ల జైలు శిక్ష

By telugu news teamFirst Published Sep 7, 2021, 2:14 PM IST
Highlights

హోం క్వారంటైన్ లో ఉండమని అక్కడి ప్రభుత్వం సూచించింది. దాదాపు 28 రోజుల పాటు.. హోం  క్వారంటైన్ లో ఉండమని సూచించారు.


కోవిడ్ రూల్ బ్రేక్ చేసి.. కరోనా వ్యాప్తికి కారణమయ్యాడంటూ.. ఓ వ్యక్తికి ఏకంగా ఐదేళ్లు జైలు శిక్ష విధించారు. ఈ సంఘటన వియత్నాం లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రావిన్షియల్ పీపుల్స్ కోర్టు వెబ్ సైట్ లో తెలియజేసిన వివరాల ప్రకారం.. లెవాన్ ట్రై అనే వ్యక్తి ఈ ఏడాది జులైలో.. కరోనా హాట్ స్పాట్ గా ఉన్న సిటీకి వెళ్లాడు. ఆ తర్వాత వియత్నమీస్ రూల్స్ ప్రకారం.. హోం క్వారంటైన్ లో ఉండమని అక్కడి ప్రభుత్వం సూచించింది. దాదాపు 28 రోజుల పాటు.. హోం  క్వారంటైన్ లో ఉండమని సూచించారు.

అయితే.. సదరు వ్యక్తి ఆ రూల్స్ ని బ్రేక్ చేశాడు. హోం క్వారంటైన్ లో ఉండకుండా బయటకు తిరిగాడు., దీంతో.. అతని కారణంగా చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఓ వ్యక్తి ఏకంగా ఆగస్టు 2021 లో  ప్రాణాలు కూడా కోల్పోయాడు.  లెవాన్ ట్రై కారణంగా ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ రాగా.. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

అతను క్వారంటైన్ లో ఉండి ఉంటే.. ఈ ప్రమాదం జరగకుండా ఉండేదని న్యాయస్థానం పేర్కొంది. రూల్స్ పట్టించుకోకుండా కరోనా వ్యాప్తి చేసిందుకు గాను..  లెవాన్ ట్రైకి అక్కడి న్యాయస్థానం ఐదు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది.

click me!