ఢిల్లీలో దారుణం.. నడిరోడ్డుపై బాలికను కర్రతో కొట్టి, బూటు కాలితో తన్ని దాడి.. సీసీ కెమెరాల్లో రికార్డ్..

Published : Feb 12, 2022, 07:13 AM IST
ఢిల్లీలో దారుణం.. నడిరోడ్డుపై బాలికను కర్రతో కొట్టి, బూటు కాలితో తన్ని దాడి.. సీసీ కెమెరాల్లో రికార్డ్..

సారాంశం

ఢిల్లీలో మహిళా రక్షణకు భద్రత లేకుండా పోతోంది. పట్టపగలు, నడి రోడ్డు మీదే దాడులకు తెగబడుతున్నారు. ఓ బాలిక మీద గుర్తు తెలియని వ్యక్తి దాడికి తెగబడ్డ ఘటన సంచలనంగా మారింది. ఈ వీడియో బైటికి రావడంతో ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది.

ఢిల్లీ : దేశ రాజధాని Delhiలో దారుణం జరిగింది. Girlపై ఓ వ్యక్తి నడిరోడ్డుమీదే తీవ్రంగా attackకి పాల్పడ్డాడు. కర్ర, బూటుతో విచక్షణారహితంగా కొట్టాడు. దీనిపై Delhi Women's Commission ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. ఢిల్లీ పశ్చిమ్ విహార్ ప్రాంతంలో ఓ వ్యక్తి బాలికపై దాడికి పాల్పడిన ఘటన అక్కడ CCTV cameraల్లో నమోదయింది. బాలికను దొరకబుచ్చుకున్న సదరు వ్యక్తి.. కర్రతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. విడిపించుకోవాలని బాధితురాలు ఎంత ప్రయత్నించినా ఆమెను వదల్లేదు. 

ఆ తర్వాత కాలికి ఉన్న బూటుతో నిర్దాక్షిణ్యంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనపై స్థానిక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్.. డిసిడబ్ల్యూకి ఫిర్యాదు చేసింది. సిసిటీవీ ఫుటేజ్ ను సైతం అందించింది. నిందితుడిని డ్రగ్స్ కి బానిసగా పేర్కొన్న అసోసియేషన్ ఆ అమ్మాయిని కొందరు బంధించినట్లు తెలిపింది. ఆ బాలిక జీవితం ఆపదలో ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ ఘటనపై డిసిడబ్ల్యూ సీరియస్ గా స్పందించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేయాలంటూ కమిషన్ చీఫ్ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. దర్యాప్తు, అరెస్టుకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని స్పష్టం చేశారు. బాలికను రక్షించిన తర్వాత ఆమెకు భద్రత కల్పించాలని కోరారు.  ఘటనకు గల కారణాలను తెలుసుకోవాలి అని.. ఈ వ్యవహారంలో తీసుకున్న చర్యలకు సంబంధించిన.. సమగ్ర నివేదికను 48 గంటల్లోగా కమిషన్ కు అందజేయాలని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు.

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. వావి వరసలు మరిచి కూతురు వరసైన బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించాడో సవతి తండ్రి. Bathroomలో రహస్యంగా  phone పెట్టి ఆ అమ్మాయి స్నానం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించాడు. ఫోన్ లో video గమనించిన తల్లి Second husband  వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసి..  పోలీసులను ఆశ్రయించింది.  పోలీసుల కథనం ప్రకారం.. వన్ టౌన్  గట్టు వెనక ప్రాంతానికి చెందిన ఒక మహిళకు కొడుకు, కూతురు. కూతురు 9వ తరగతి చదువుతుంది. భర్తతో విభేదాల కారణంగా... అతనితో విడిపోయి రెండో వివాహం చేసుకుంది. 

రెండో భర్త, పిల్లలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 4న... 9:30 గంటల సమయంలో ఇంట్లోని బాత్రూంలో ఫోన్ లో వీడియో ఆన్ చేసి బాత్రూంలో రహస్యంగా పెట్టాడు రెండో భర్త. ఆ తరువాత స్నానానికి వెళ్లిన బాలిక వీడియో అందులో రికార్డ్ అయ్యింది. గురువారం ఉదయం పది గంటల సమయంలో మహిళ తన రెండు భర్త ఫోన్ లో... ఫోటోలు చూస్తుండగా కూతురు స్నానం చేస్తున్న వీడియో కనిపించింది. ఈ విషయమై రెండో భర్తతో గొడవ పడింది. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

దేశ ఎగుమతుల్లో ఈ రాష్ట్రం టాప్... ఏడాదికి ఇన్నివేల కోట్లా..!
నేను కూడా భారతీయుడినే..European Council President Surprises PM Modi | PM Modi | Asianet News Telugu