సినిమాటిక్ లెవల్లో.. జైల్లో గ్యాంగ్ స్టర్ ఎంజాయ్మెంట్ మామూలుగా లేదుగా .!

By telugu news teamFirst Published Aug 26, 2021, 9:14 AM IST
Highlights

లాకప్లో హ్యాపీగా కుర్చొని మద్యం తాగుతూ అందులో కలుపుకోవడానికి కూల్ డ్రింగ్స్, తినడానికి స్నాక్స్‌తో పాటు చేతిలో సిగరెట్టుతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. 

సినిమాల్లో కొన్ని సీన్లు చూసి.. వీళ్లు మరీ అతిగా చూపిస్తున్నారు అని అనుకుంటాం కానీ..  నిజ జీవితంలోనూ అలాంటి సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. సినిమాల్లో విలన్లు.. జైల్లో ఉంటూ కూడా... తమ దందాలు చేస్తూ ఉంటారు. తాజాగా రియల్ లైఫ్ లోనూ ఓ గ్యాంగ్ స్టర్ అదేవిధంగా చేయడం గమనార్హం. జైల్లో ఉంటూనే భోగాలు అనుభవిస్తున్నాడు. ఏకంగా స్నేహితులతో కలిసి జైల్లోనే మద్యం సేవిస్తూ.. ఎంజాయ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ బయటకు రావడంతో.. అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. 

ఈ వీడియోలో లాకప్ లో ఉన్న గ్యాంగ్ స్టర్ మందు పార్టీ ఎంజాయ్ చేస్తున్ానడు. . నలుగురు వ్యక్తులు లాకప్లో హ్యాపీగా కుర్చొని మద్యం తాగుతూ అందులో కలుపుకోవడానికి కూల్ డ్రింగ్స్, తినడానికి స్నాక్స్‌తో పాటు చేతిలో సిగరెట్టుతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఇదిలా ఉంటే లాకప్‌లోని మరొక గ్యాంగ్‌స్టర్ సరదాగా ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. అయితే ఈ వీడియోని ఆ జైలులో ఉన్న ఢిల్లీకి చెందిన ఓ గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవన పోస్ట్ చేయడం ఇందులోని ట్విస్ట్ అని చెప్పాలి. అంతే కాదు ఆ వీడియోలో ఉన్నది నీరజ్ బవన సోదరులైన రాహుల్ కాలా, నవీన్ బాలి కావడం గమనార్హం.

 

అయితే అప్పటికే రాహుల్ కాలా, నవీన్ బాలి జైలులో ఉండగా ఈ నెల ఐదవ తారీకున పోలీసులు వారిని మళ్లీ అరెస్టు చేశారు. కస్టడిలో ఉంచి విచారణ చేసిన పోలీసులు ఆగస్టు 10న వీరిని తిరిగి జైలుకు పంపించారు. ఇదిలా ఉంటే వీళ్లను మళ్లీ అరెస్టు చేసింది కూడా జైలు నుంచి బయటి వారిని బెదిరింపులకు గురి చేసినందుకు కావడం గమనార్హం. ఇంకా ఈ వీడియోలో వీరున్న సెల్‌కి ఎదుట సెల్లో కొందరు ఖైదీలు కూడా కనిపిస్తున్నారు. అయితే ఈ వీడియోలో ఇదంతా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా తమకు ఏమీ తెలియనట్టుగా లాకప్‌లో మద్యం అందించబడదని జరిగిన సంఘటణపై విచారణ చేస్తామని చెప్పి సైలెంట్ అయిపోయారు. ఇదిలా ఉండగా ఈ వీడియో మాత్రం ఇంటర్ నెట్లో వైరలై చక్కర్లు కొడుతోంది.

click me!