ఇలా చేస్తే పొట్ట తగ్గుతుందా..? వైరల్ అవుతున్న వీడియో..!

Published : May 10, 2023, 09:52 AM IST
ఇలా చేస్తే పొట్ట తగ్గుతుందా..? వైరల్ అవుతున్న వీడియో..!

సారాంశం

దాంట్లో వారు బరువు తగ్గించుకోవడానికి, పొట్ట తగ్గించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు నవ్వులు పూయిస్తున్నాయి.   

ఈరోజుల్లో బరువు తగ్గించుకోవాలి, పొట్ట తగ్గించుకోవాలని తాపత్రయపడని వారు చాలా అరుదు అని చెప్పొచ్చు. దాని కోసం చాలా మంది చాలా తిప్పలు పడుతూ ఉంటారు. కొందరు తిండి తినడం మానేస్తారు, కొందరు జిమ్ ల వెంట పరిగెడతారు. ఇలా ఎవరికి తోచిన పని వారు చేస్తూ ఉంటారు. కానీ ఫలితం వస్తుందా అంటే చెప్పలేం. కొందరికి రావచ్చు. కొందరికి రాకపోవచ్చు. జనాల అవసరాలను బట్టి, ఈ బరువు తగ్గించే కంపెనీలు కూడా ఎక్కువగా పుట్టుకువస్తున్నాయి.తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. దాంట్లో వారు బరువు తగ్గించుకోవడానికి, పొట్ట తగ్గించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు నవ్వులు పూయిస్తున్నాయి. 

 

ఆ వీడియోలో చాలా మంది మహిళలు ఉన్నారు. అదేదో వెయిట్ లాస్ ప్రొగ్రాం అనుకుంట. ఆన్ లైన్ లో కూడా చాలామంది జాయిన్ అయ్యారు. వారంతా తమ పొట్టపై చపాతీ కర్ర తీసుకొని రుద్దుతున్నారు. చపాతీ పిండిని రుద్దినట్లు పొట్టను రుద్దుతున్నారు. ఆ తర్వాత వారి దగ్గర మరి కొన్ని ఆసక్తికర వస్తువులు కూడా ఉన్నాయి. తొడల దగ్గర కొవ్వు తగ్గించడానికి ఇలా రకరకాలుగా వాడుతున్నారు. ఇదంతా ఆక్యు ప్రెషర్ ట్రైనర్ ఫిట్నెస్ క్లాస్ లో భాగమట.

ముఖ్యంగా డ్యాన్స్ చేసుకుంటూ, పొట్ట దగ్గర కొవ్వు కరిగించడానికి వారు చపాతీ కర్ర ఉపయోగించడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో వైరల్ గా మారగా, నెటిజన్లు రకరాలుగా స్పందిస్తున్నారు. ఇలా చేస్తే పొట్ట తగ్గుతుందని తమకు ఇప్పటి వరకు తెలీదన్నారు.

ఇక ఎప్పటికీ ఆ చపాతీ కర్రీ కిచెన్ లోకి చేరదు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయడం విశేషం. కొందరేమో తాము కూడా ప్రయత్నిస్తామంటూ కామెంట్స్ చేస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..
మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?