రోడ్డు దాటకుండా... యజమాని కోసం ఎదురు చూస్తున్న ఆవు.... నెట్టింట వీడియో వైరల్..!

Published : Nov 24, 2022, 03:47 PM ISTUpdated : Nov 24, 2022, 03:49 PM IST
రోడ్డు దాటకుండా... యజమాని కోసం ఎదురు చూస్తున్న ఆవు.... నెట్టింట వీడియో వైరల్..!

సారాంశం

జీబ్రా క్రాసింగ్‌కు అవతలివైపు రోడ్డు దాటడానికి వేచి ఉన్న ఆవు వీడియోలో కనపడుతోంది.  అయితే ఎటువంటి ట్రాఫిక్ లేనప్పటికీ, దాని యజమాని వచ్చే వరకు ఓపికగా వేచి ఉండటం విశేషం.

జంతువులకు  కొంచెం ప్రేమ చూపిస్తే చాలు అవి మనపై విపరీతమైన విశ్వాసం చూపిస్తాయి. విపరీతమైన ప్రేమను కూడా కురిపిస్తాయి. ఇలాంటి సంఘటనలు ఇప్పటి వరకు మనం చాలా సార్లు చూశాం. తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఓ ఆవు తన యజమాని కోసం ఎదురు చూస్తున్న వీడియో... నెట్టింట వైరల్ గా మారింది.

ఆవు రోడ్డు మీద తన యజమాని కోసం ఎదురు చూస్తూ ఉంది. జీబ్రా క్రాసింగ్‌కు అవతలివైపు రోడ్డు దాటడానికి వేచి ఉన్న ఆవు వీడియోలో కనపడుతోంది.  అయితే ఎటువంటి ట్రాఫిక్ లేనప్పటికీ, దాని యజమాని వచ్చే వరకు ఓపికగా వేచి ఉండటం విశేషం.

చాలా మంది డ్రైవర్లు  ఆవు రోడ్డు దాటడానికి అవకాశం ఇచ్చారు. ఆవు వెళ్తుంది అని... కార్లు కూడా స్లోగా పోనిచ్చారు. అయినా కూడా.... ఆ ఆవు వెళ్లకుండా అక్కడే ఎదురు చూస్తూ ఉండటం గమనార్హం.   ఈ వీడియో అమెరికన్ సోషల్ న్యూస్ అగ్రిగేషన్ వెబ్‌సైట్ రెడ్డిట్‌లో పోస్టు చేయగా... అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.


ప్రతిరోజూ ఒక బామ్మ ఈ ఆవును పచ్చిక బయళ్లకు నడిపిస్తుందని, ఆవు తగినంత మేత మేసుకుని తిరిగి వెళ్లాలని భావించినప్పుడు, అది క్రాసింగ్ వద్దకు వచ్చి బామ్మ కోసం వేచి చూస్తుందని వీడియోలోని మహిళ స్వరం చెబుతోంది. ఆ బామ్మ వచ్చిన తర్వాత... ఆవు.. ఆమెతో కలిసి ఇంటికి వెళ్లడం విశేషం.

PREV
click me!

Recommended Stories

Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం
Zero Poverty Mission : యూపీలో పేదరికంపై యోగి ప్రభుత్వ నిర్ణయాత్మక పోరాటం