‘మోడీ ప్రభుత్వాన్ని నమొద్దు.. పెళ్లి చేసుకోండి ’- కేంద్ర ప్రభుత్వంపై అసదుద్దీన్ ఒవైసీ వ్యంగాస్త్రాలు

By team teluguFirst Published Nov 24, 2022, 3:25 PM IST
Highlights

దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. గుజరాత్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆయన ప్రధాని మోడీపై వ్యంగాస్త్రాలు సంధించారు. 

భారతదేశంలో నిరుద్యోగ రేటుపై ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యంగాస్త్రాలు సంధించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన దానిలిమ్డా నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో గురువారం పాల్గొని మాట్లాడారు. తాను బస చేస్తున్న హోటల్‌లో ఓ యువకుడు వచ్చి తనను కలిశాడని అన్నారు. నేను ఆ అబ్బాయిని ఎలా ఉన్నావని అని అడిగానని చెప్పాడు. దానికి అతడు బదులిస్తూ..‘‘నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి నా దగ్గరకు వచ్చి ‘నీకు ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? మా నాన్న నా కోసం మరో అబ్బాయిని వెతుకుతున్నాడు ’ అని చెప్పింది. అయితే నేను ఆమెకు ‘మోడీ ప్రభుత్వాన్ని నమ్మొద్దు. పెళ్లి చేసుకో అని సూచించాను’’ అని ఆ యువకుడు చెప్పాడని ఒవైసీ తెలిపాడు.

11 నెలల కిందటే పెళ్లి .. పరాయి స్త్రీ మోజులో పడ్డ భార్త.. మనస్తాపానికి గురైన భార్య.. దీంతో ..

అయితే.. ఇది జోక్ అని, నిజమైన సంఘటన కాదని ఒవైసీ స్పష్టం చేశారు. ప్రధాని మోడీ ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ దాని నుండి వెనక్కి తగ్గారని ఎఐఎంఐఎం చీఫ్ విమర్శించారు. ప్రధాని హామీ ప్రకారం గత ఎనిమిదేళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సి ఉందని అన్నారు. కానీ ఇప్పుడు ప్రధాని మోదీ 2024 వరకు కేవలం 10 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇస్తామని చెబుతున్నారని విమర్శించారు. 

. सरकार पर भरोसा न करें, पापा लड़का ढूंढ रहे हैं। | Barrister 🪁 pic.twitter.com/EWs3YPpQ94

— AIMIM (@aimim_national)

రానున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 14 అసెంబ్లీ స్థానాల్లో ఏఐఎంఐఎం పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాబీర్ కబ్లివాలా తెలిపారు. రాష్ట్రంలో ఆ పార్టీ పోటీ చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏఐఎంఐఎం 26 స్థానిక సంస్థలను మాత్రమే గెలుచుకుంది. ఎంఐఎం ముఖ్యంగా ముస్లిం, దళిత ఓట్లపై దృష్టి సారిస్తోంది. షెడ్యూల్డు కులాలకు రిజర్వ్ చేసిన దనీలిమ్డా స్థానం నుండి ఏఐఎంఐఎం తన దళిత అభ్యర్థి కౌశిక పర్మార్ ను నిలబెట్టింది.

రైల్వేలో ప్రతీ మూడు రోజులకు ఒక ఉద్యోగిపై కొరడా.. 16 నెలల్లో వందలాది మందిపై వేటు

కాగా..  ఈ సారి తొలిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గుజరాత్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. బీజేపీ ప్రస్తుత సీఎం భూపేంద్ర పటేల్‌ను మరో సారి తన సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే ఆప్ ఇషుదన్ గద్వీని సీఎం అభ్యర్థిగా నిలబెట్టింది. ఇదిలా ఉండగా.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ డిసెంబర్ 1న జరగనుండగా.. రెండో దశ పోలింగ్ డిసెంబర్ 5న జరగనుంది. డిసెంబర్ 8న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు 1,621 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  అధికార బీజేపీ మొత్తం 182 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. కాంగ్రెస్ 179 స్థానాల్లో నిలబెట్టింది. ఎన్సీపీకి 3 స్థానాలను కేటాయించింది. 

click me!