యూనిఫాం సివిల్ కోడ్ అమలుపై ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు .. ఇంతకీ ఏమన్నారంటే..?

Published : Jul 05, 2023, 12:58 AM ISTUpdated : Jul 05, 2023, 01:03 AM IST
యూనిఫాం సివిల్ కోడ్ అమలుపై ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు .. ఇంతకీ ఏమన్నారంటే..?

సారాంశం

యూనిఫాం సివిల్ కోడ్ యూనిఫాం సివిల్ కోడ్ (UCC) అమలుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వం యూసీసీ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు కొన్ని పార్టీలు మద్దతిచ్చాయి. కాగా, యూసీసీపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ కీలక ప్రకటన చేశారు. యూసీసీని అమలు చేసేందుకు ఇదే సరైన సమయమని అన్నారు.

యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)పై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ కీలక ప్రకటన చేశారు. యుసిసిని అమలు చేయడానికి ఇదే సరైన సమయమని ధంఖర్ అన్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గౌహతి 25వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తున్నప్పుడు ఉపరాష్ట్రపతి UCCపై ఈ ప్రకటన చేశారు. ఉపరాష్ట్రపతి  మాట్లాడుతూ.. "రాజ్యాంగ నిర్మాతలు ఊహించిన విధంగా UCCని అమలు చేయడానికి ఇది సరైన సమయం." రాజ్యాంగంలోని 44వ అధికరణం  దేశవ్యాప్తంగా ప్రజలంతా ఒకే సివిల్ కోడ్ ఉండాలని సూచిస్తోందని చెప్పారు.

పంచాయతీలు, కోఆపరేటివ్‌లు, విద్యాహక్కు వంటి చట్టాలను ఇప్పటికే తీసుకురావడం జరిగిందని, ఇప్పుడు ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసే సమయం వచ్చిందని అన్నారు. దేశం తన పౌరులకు UCC భద్రతను కల్పించేందుకు ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. ఇది రాజ్యాంగ నిర్మాతల ఆలోచనా విధానం. ఇప్పుడు యూసీసీ అమలుకు సమయం ఆసన్నమైంది. ఎటువంటి ఆటంకాలు  లేదా ఆలస్యం చేయకుండా అమలు చేయాలని అన్నారు.

UCC ఫ్రేమ్‌వర్క్ సిద్ధం 

యూనిఫాం సివిల్ కోడ్‌కు సంబంధించి లా కమిషన్ ప్రాథమిక ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేసింది. ఇందులో లింగ సమానత్వానికి గరిష్ట ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇందుకోసం ఇప్పటి వరకు దాదాపు 9 లక్షల సూచనలు అందాయని లా కమిషన్ చెబుతోంది.

UCC పై చర్చ

యూనిఫాం సివిల్ కోడ్‌కు సంబంధించి ఇటీవల భోపాల్‌లో ప్రధాని మోదీ చేసిన ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా దాని గురించి చర్చ తీవ్రమైంది. దీనికి సంబంధించి అనేక రకాల ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. ఇది లోక్‌సభ ఎన్నికలతో కూడా ముడిపడి ఉంది.

పార్లమెంటరీ కమిటీ సమావేశం

యూనిఫాం సివిల్ కోడ్‌కు సంబంధించి న్యాయ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీ యొక్క ముఖ్యమైన సమావేశం కూడా సోమవారం (జూలై 3) జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ప్రభుత్వ ఉద్దేశంపై కూడా ప్రశ్నలు సంధించారు.

PREV
click me!

Recommended Stories

PM Surya Ghar Scheme : ఇలా చేశారో విద్యుత్ ఛార్జీలుండవు.. డబ్బులు సేవ్
గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?