ఎన్నికల్లోగా జనాభా నియంత్రణ చట్టం, యూనిఫాం సివిల్ కోడ్.. మోడీ షా ఆలోచన ఇదే : ప్రవీణ్ తొగాడియా

Siva Kodati |  
Published : Feb 19, 2023, 09:44 PM IST
ఎన్నికల్లోగా జనాభా నియంత్రణ చట్టం, యూనిఫాం సివిల్ కోడ్.. మోడీ షా ఆలోచన ఇదే : ప్రవీణ్ తొగాడియా

సారాంశం

దేశంలో పెరుగుతున్న జనాభాను కంట్రోల్ చేయాల్సిన అవసరం వుందన్నారు అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా. ఎన్నికలకు ముందే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు జనాభా నియంత్రణ, యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)చట్టాన్ని తెస్తారని ఆయన వ్యాఖ్యానించారు. 

విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) మాజీ నేత ప్రవీణ్ తొగాడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ అధ్యక్షుడిగా వున్న ఆయన ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లా బస్సా ప్రాంతంలోని బహిరంగ సభలో ప్రసంగించడానికి ముందు రాయ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో నానాటికీ పెరుగుతున్న జనాభాను టిక్కింగ్ టైమ్ బాంబ్‌గా ఆయన అభివర్ణించారు. దీని పేలుడుతో ఏర్పడే ప్రతికూల ప్రభావాలను నిరోధించడానికి ఒక చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం వుందని ప్రవీణ్ తొగాడియా అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు ముందుకు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు జనాభా నియంత్రణ, యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)చట్టాన్ని ప్రవేశపెడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

జనాభా విపరీతంగా పెరిగిపోతే అది మన నగరాలు, గ్రామాల్లో అంతర్యుద్ధాలకు దారి తీస్తుందని ప్రవీన్ తొగాడియా హెచ్చరించారు. అందువల్ల అటువంటి పరిస్ధితిని నివారించడానికి, జనాభా నియంత్రణ చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం వుందన్నారు. ఈ క్రమంలో మోడీ, అమిత్ షాలు జనాభా నియంత్రణ, యూసీసీ, కాశీ, మధురలో దేవాలయాల నిర్మాణానికి సంబంధించిన చట్టాలను రూపొందించిన తర్వాత 2024 ఎన్నికలకు వెళతారని తాను నమ్ముతున్నట్లు ప్రవీణ్ అన్నారు. ఈ యత్నాలు హిందువులను మాత్రమే కాకుండా, వారి (బీజేపీ) ఓట్లను కూడా కాపాడతాయని ఆయన వ్యాఖ్యానించారు. 

ALso REad: చైనాను అధిగమించిన భారత్ ..! జనాభాలో మనమే టాప్.. !!

మీడియా అడిగిన మరో ప్రశ్నకు ప్రవీణ్ తోగాడియా సమాధానమిస్తూ.. భారత్ ఇప్పటికే హిందూ రాజ్యమని, దానిని హిందూ రాజకీయ రాజ్యంగా స్థాపించాలనుకుంటున్నట్లు చెప్పారు. భారతదేశం హిందూ మెజారిటీ దేశమని, మనదేశంలో హిందువులు అభద్రతా భావాన్ని అనుభవించడానికి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని ప్రవీణ్ తొగాడియా స్పష్టం చేశారు. 

కాగా. సెన్సస్ , డెమోగ్రాఫిక్స్‌పై పనిచేస్తున్న స్వతంత్ర సంస్థ వరల్డ్ పాపులేషన్ రివ్యూ తన నివేదికలో 2022 చివరి నాటికి భారతదేశ జనాభా 1.417 బిలియన్లకు (సుమారు 10 బిలియన్లు) చేరుకుందని పేర్కొంది. అదే సమయంలో..చైనా  తన నివేదికను సమర్పించింది, దీనిలో పొరుగు దేశం యొక్క జనాభా 1.412 బిలియన్లు, అంటే భారతదేశం కంటే సుమారు 5 మిలియన్లు తక్కువగా ఉన్నట్లు పేర్కొంది.  యునైటెడ్ నేషన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ (జనాభా విభాగం) ఇటీవలి వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022 నివేదిక ప్రకారం 2023లో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను భారత్ అధిగమిస్తుందని అంచనా వేసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !