
న్యూఢిల్లీ: బిహార్‌లో గత కొన్ని రోజులుగా బాంబు పేలుళ్లు వరుసగా జరుగుతున్నాయని, ఈ బాంబు పేలుళ్లు దేశ అంతర్గత భద్రతకు పెను ముప్పు కలిగిస్తుందని విశ్వ హిందు పరిషద్ పేర్కొంది. ఈ పేలుళ్లు దర్యాప్తు సంస్థలకు, ప్రభుత్వం, పాలనా అధికారులకు మధ్య అంతరాన్ని వెల్లడిస్తున్నదని ఆరోపించింది. వెంటనే ఈ పేలుళ్లకు ఫుల్ స్టాప్ పెట్టాలని డిమాండ్ చేసింది. విశ్వ హిందు పరిషద్ సెంట్రల్ సెక్రెటరీ జనరల్ మిలింద్ పరాండే మాట్లాడుతూ.. ఈ పేలుళ్ల నిగ్గు తేల్చడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)తో అన్ని కోణాల్లో, అన్ని స్థాయిల్లో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
రోజు రోజుకు పెరుగుతున్న ఈ పేలుళ్లకు, ఈ ఉద్రిక్త పరిస్థితులకు చెక్ పెట్టాలని ఆయన పేర్కొన్నారు. కాబట్టి, విస్తృత స్థాయిలో ఎన్‌ఐఏ ద్వారా దర్యాప్తు జరిపించాలని కోరారు. గడిచిన తొమ్మిది నెలల్లో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారని వివరించారు. బంకా, అరేరియా, ఖగారియా, సివన్, దర్బంగా, భగల్‌పుర్ ఇప్పుడు గోపాల్‌గంజ్ ఇలాంటి చోట్ల పేలుళ్లు జరిగాయని తెలిపారు. ఈ దాడుల వెనుక జిహాదీ ఉగ్రవాదులు, బంగ్లాదేశీ లింకులు ఉండవచ్చని ఆరోపణలు చేశారు. కానీ, కొన్నేళ్లుగా ఇక్కడ పోలీసు శాఖ కేవలం కవర్ అప్ విధానాన్ని అవలంభిస్తున్నదని పేర్కొన్నారు. చాలా బాంబు పేలుళ్ల కేసులో పోలీసు తీరు ఇలాగే ఉన్నదని అన్నారు. దారుణమైన బాంబు పేలుళ్ల ఘటనను కేవలం ఫైర్ క్రాకర్ పేలుళ్లుగా పేర్కొనడం రాష్ట్ర భద్రతకు పెను ముప్పు అని చెప్పారు. ఇలా ఫైర్ క్రాకర్ పేలుడు అని చెప్పడం ద్వారా అది సహజమైన పేలుడుగా భావించడం, తద్వారా దర్యాప్తులో తుది దశకూ చేరకుండానే కేసు మూసేయడం వంటివి బిహార్‌లో జరుగుతున్నాయని తెలిపారు.
ఇప్పటికే బిహార్‌లోని చాలా నగరాలు ముస్లిం డామినేటెడ్ నగరాలుగా మారాయని ఆయన పేర్కొన్నారు. సాహిబ్ గంజ్, పాకుర్ జిల్లాలును మాత్రం సరిహద్దుల్లోకి చొచ్చుకువచ్చే ఘటనలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. అయితే, ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన తాలిబ్‌లు అంటే విద్యార్థులు వచ్చి ఆకలితో ఉన్నారని వివరించారు. ఈ లవ్ జిహాద్‌లు ముఖ్యంగా అమ్మాయిలపై కన్నేస్తున్నారని పేర్కొన్నారు. హిందు అమ్మాయిలను బాధితులుగా మారుస్తున్నారని చెప్పారు. వారిని అపహరించడం పొరుగు దేశాలైనా నేపాల్, బంగ్లాదేశ్‌కు తరలిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగి ఈ పీడను వదిలగొట్టాలని కోరినట్టు విశ్వహందూ పరిషద్ నేషనల్ స్పోక్స్‌పర్సన్ వినోద్ బన్సాలో ఓ ప్రకటనలో పేర్కొన్నారు.