Punjab Assembly Election Resuts 2022 నేను ఉగ్రవాదిని కానని ఈ ఫలితాలు నిరూపించాయి: కేజ్రీవాల్

Published : Mar 10, 2022, 03:44 PM ISTUpdated : Mar 10, 2022, 03:53 PM IST
Punjab Assembly Election Resuts 2022 నేను ఉగ్రవాదిని కానని ఈ ఫలితాలు నిరూపించాయి: కేజ్రీవాల్

సారాంశం

పంజాబ్ ప్రజలు అద్భుత విజయాన్ని ఇచ్చారని డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. పంజాబ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల సరళిపై ఆయన గురువారం నాడు వ్యాఖ్యానించారు. 

చంఢీఘడ్: పంజాబ్ ప్రజలు అద్భుత విజయాన్ని అందించారని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ Arvind Kejriwal చెప్పారు.Pujab Assembly Election Result 2022 సరళిపై గురువారం నాడు ఢిల్లీలో మాట్లాడారు.ఎన్నికల ప్రచారంలో తనను ఉగ్రవాది అని కూడా ప్రచారం చేశారని కేజ్రీవాల్ చెప్పారు ఎన్నికల ఫలితాలు తాను ఉగ్రవాదిని కానని రుజువు చేశాయన్నారు. ఇంక్విలాబ్ భారతదేశం మొత్తం విస్తరిస్తుందన్నారు. మహిళలు, యువకులు, రైతులు, కార్మికులు ఆప్ తో ఉన్నారని ఆయన చెప్పారు.

పంజాబ్ ప్రజలు అసాధ్యాలను సుసాధ్యం చేశారన్నారు. ఆప్ ను ఇరుకున పెట్టేందుకు ఏకమైన అన్ని పార్టీలకు, నేతలకు ప్రజలు తగిన సమాధానం చెప్పారన్నారు. తాను తీవ్రవాదిగా పిలిచారు. కానీ తాను దేశ భక్తుడిని అని కేజ్రీవాల్ చెప్పారు.పంజాబ్ సీఎం చన్నీని ఆప్ ఓడించిందన్నారు. పంజాబ్ సీఎంను ఒడించిన అభ్యర్ధి మొబైల్ షాపులో పనిచేస్తున్నాడని కేజ్రీవాల్ చెపపారు. అతని తల్లి ప్రభుత్వ స్కూల్ లో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తుందన్నారు. పీసీసీ చీప్ సిద్దూను ఓడించిన మహిళా కూడా సామాన్య కార్యకర్త అని  ఆయన చెప్పారు. 

తొలుత Delhi లో, ఆ తర్వాత పంజాబ్ లో విప్లవాన్ని సాధించామన్నారు. ఇక దేశంలో ఇంక్విలాబ్ సాధించాల్సిన అవసరం ఉందన్నారు. మెడిసిన్ చదివేందుకు భారతీయ విద్యార్ధులు ఉక్రెయిన్ కూడా వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. కార్మికులు, మహిళలు, యువకులు ఆప్ లో చేరాలని ఆయన కోరారు. 

ఈ ఎన్నికల ఫలితాలు మనలో అహంకారాన్ని తీసుకురావొద్దన్నారు. ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లో వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన కోరారు. ప్రజలు మనపై ఉంచిన విశ్వాసాన్ని నిలుపుకోవాలని ఆయన కోరారు. బ్రిటీష్ వాళ్ల పాలన ముగిసినా కూడా వాళ్ల సిస్టమ్ కూడా అలానే ఉందన్నారు. గత ఏడేళ్లలో పరిపాలనా అంటే ఎలా ఉండాలో ఢిల్లీ చేసి చూపించామని కేజ్రీవాల్ చెప్పారు.
 


 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu